రూపాయి కోలుకుందోచ్‌!

రూపాయి కోలుకుందోచ్‌!

రెండు రోజులుగా పతన బాటలో సాగుతున్న దేశీ కరెన్సీకి బలమొచ్చింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 26 పైసల లాభంతో ప్రారంభమైంది. తదుపరి మరికొంత పుంజుకుంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 31 పైసలు(0.4 శాతం) ఎగసి 71.40 వద్ద ట్రేడవుతోంది. ఓవైపు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య నీరసించినప్పటికీ రూపాయి జోరందుకోవడం విశేషం. ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టనున్న అంచనాలు దేశీ కరెన్సీకి జోష్‌నిస్తున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. 

రెండు రోజులుగా..
గత రెండు రోజుల్లో డాలరుతో మారకంలో రూపాయి 57 పైసలు కోల్పోయింది. మంగళవారం ఒడిదొడుకుల మధ్య కదిలిన రూపాయి విలువ చివరికి 28 పైసలు క్షీణించింది. 71.71 వద్ద స్థిరపడింది. ఇది ఆరు నెలల కనిష్టంకాగా.. సోమవారం(19న) సైతం రూపాయి 29 పైసలు బలహీనపడి 71.43 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తుతున్న సంకేతాలతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు సహాయక ప్యాకేజీలు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.3కు బలపడగా.. జపనీస్‌ యెన్‌ వంటి రక్షణాత్మక కరెన్సీలు సైతం బలహీనపడ్డాయి. వీటికితోడు దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల పసిడి, ముడిచమురు ధరలు పెరుగుతూ రూపాయిపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');