మెటల్‌, బ్యాంక్స్‌, రియల్టీ స్కిడ్‌

మెటల్‌, బ్యాంక్స్‌, రియల్టీ స్కిడ్‌

ప్రపంచ మార్కెట్లలో మూడు రోజుల ర్యాలీకి చెక్‌ పడటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 143 పాయింట్ల వెనకడుగుతో 37,185కు చేరగా.. నిఫ్టీ సైతం 57 పాయింట్లు క్షీణించి 10,960 వద్ద ట్రేడవుతోంది. కాగా.. శుక్రవారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ జాక్సన్‌ హోల్‌వద్ద వార్షికోత్సవ ప్రసంగం చేయనున్నారు. మరోవైపు ఫెడరల్‌ రిజర్వ్‌తోపాటు.. రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టిన గత పాలసీ సమీక్షా వివరాలు మినిట్స్‌ ద్వారా నేడు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

ఎఫ్‌ఎంసీజీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ రంగాలు 2 శాతం చొప్పున క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం డీలాపడింది. ప్రభుత్వ బ్యాంక్స్‌లో అలహాబాద్‌, జేఅండ్‌కే, బీవోబీ, ఇండియన్‌, సిండికేట్‌, ఓబీసీ, కెనరా, బీవోఐ, పీఎన్‌బీ, యూనియన్‌, సెంట్రల్‌, ఎస్‌బీఐ 6.3-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. మెటల్‌ కౌంటర్లలో సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎన్‌ఎండీసీ, హింద్‌ కాపర్‌, జిందాల్‌ స్టెయిన్‌, వేదాంతా, నాల్కో, హిందాల్కో 6-2 శాతం మధ్య తిరోగమించాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్, మహీంద్రా లైఫ్‌, బ్రిగేడ్‌, శోభా, డీఎల్‌ఎఫ్‌ 7-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

నెస్లే జూమ్‌
నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌ 6-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐషర్, హీరో మోటో, ఇన్ఫోసిస్‌, మారుతీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ 1-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడీబీఐ, అరవింద్‌, ఐడియా, ఉజ్జీవన్‌, రిలయన్స్‌ కేపిటల్‌ 5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నెస్లే, టాటా ఎలక్సీ, బయోకాన్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, పెట్రోనెట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, కంకార్‌, బాలకృష్ణ, పీవీఆర్‌, జస్ట్‌డయల్‌ 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతుండటంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.75 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1480 నష్టపోగా.. 693 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');