బ్రిటానియా- టాటా మోటార్స్‌ డల్‌

బ్రిటానియా- టాటా మోటార్స్‌ డల్‌

ప్రస్తుతం దేశీయంగా కనిపిస్తున్న వినియోగ మందగమనం కొనసాగితే.. 10,000 మంది సిబ్బందిని తొలగించవలసి రావచ్చని పార్లే ప్రొడక్ట్స్‌ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా బిస్కట్ల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. మరోపక్క.. కంపెనీ దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాల రేటింగ్‌ను కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు ప్రయివేట్‌ రంగ ఆటోమోటివ్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వెరసి ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈ రెండు షేర్లూ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..

బ్రిటానియా ఇండస్ట్రీస్
వ్యవస్థలో వినియోగం క్షీణిస్తున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఇప్పటికే నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బ్రిటానియా నికర లాభం దాదాపు 4 శాతం క్షీణించి రూ. 249 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అమ్మకాలు మాత్రం 6 శాతం పెరిగి రూ. 2677 కోట్లను అధిగమించాయి. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. కాగా.. బిస్కట్లపై 18 శాతం జీఎస్‌టీ కారణంగా ధరలు తప్పనిసరిగా పెంచవలసి వచ్చినట్లు మరోవైపు పార్లే పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల బలహీనంగా కదులుతున్న బ్రిటానియా షేరు తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం పతనమైంది. రూ. 2,300 వద్ద 18 నెలల కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం 1.6 శాతం నష్టంతో రూ. 2356 వద్ద ట్రేడవుతోంది. 

Image result for Tata jlr

టాటా మోటార్స్‌ లిమిటెడ్‌
కంపెనీ దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాల రేటింగ్‌ను కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు టాటా గ్రూప్‌ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ పేర్కొంది. కంపెనీ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను AA నుంచి AA-కు కేర్‌ దిగువముఖంగా సవరించినట్లు తెలియజేసింది. లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) పనితీరు ఇటీవల మందగించడంతో రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేసింది. ఇటీవల వాహన ఎగుమతులు క్షీణిస్తుండటం, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ సంక్షోభం వంటి పరిస్థితులు కంపెనీ మార్జిన్లపై ఒత్తిడి పెంచే వీలున్నట్లు మరోపక్క విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు ప్రత్యర్ధి సంస్థలు మారుతీ, హ్యుండాయ్‌ సామర్థ్య విస్తరణకు దిగడం కూడా కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు 5.4 శాతం పతనమై రూ. 117 వద్ద ట్రేడవుతోంది. 



tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');