కూలిన' కెపాసైట్‌- ఏజీసీ 'హైజంప్‌

కూలిన' కెపాసైట్‌- ఏజీసీ 'హైజంప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఐటీ కన్సల్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏజీసీ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు వరుసగా మూడో రోజు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడమే దీనికి కారణంకాగా.. మరోపక్క పలు కార్యాలయాలలో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు వెలువడిన వార్తలు రియల్టీ అభివృద్ధి సంస్థ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఈ కౌంటర్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌
ముంబైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించినట్లు వెలువడిన వార్తలు కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్లో అమ్మకాలకు దారితీశాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలి రూ. 190 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 186 దిగువకూ పతనమైంది. కాగా.. ఈ నెల మొదట్లో ఐటీ శాఖ నాలుగు రియల్టీ కంపెనీలకు చెందిన పుణే, ముంబై కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. హబ్‌టౌన్‌, వాధ్వా గ్రూప్‌, అతుల్‌ ప్రాజెక్ట్స్‌, రేడియస్‌ డెవలపర్స్‌కు చెందిన 40 కార్యాలయాలలో సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజా సోదాలకు ప్రాధాన్యం ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Image result for agc networks limited

ఏజీసీ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఏజీసీ నెట్‌వర్క్స్‌ నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 14 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా పెరిగి రూ. 1228 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రూ. 72 వద్ద ట్రేడైన షేరు 80 శాతం దూసుకెళ్లింది. తాజాగా ఎన్‌ఎస్ఈలో రూ. 22 ఎగసి రూ. 130 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ ఏడాది జనవరిలో సొంతం చేసుకున్న బ్లాక్‌బాక్స్‌ కార్పొరేషన్‌ ఫలితాలను ఏజీసీ ఖాతాలలో చూపలేదని కంపెనీ తెలియజేసింది. బ్లాక్‌బాక్స్‌ కార్ప్‌ యూఎస్‌లో డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది.

 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');