తొలుత దూకుడు- చివరికి ఫ్లాట్‌

తొలుత దూకుడు- చివరికి ఫ్లాట్‌

ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు బలపడి 37,402 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 11,054 వద్ద ముగిసింది. కేంద్ర బ్యాంకుల సహాయక ప్యాకేజీలు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి సానుకూల వార్తల నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ ప్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీని అందుకుంది. ఇంట్రాడేలో 370 పాయింట్ల వరకూ ఎగసి 37,719కు చేరింది. ఇక నిఫ్టీ సైతం సెంచరీ చేసి 11,147 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే చివర్లో ట్రేడర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు వెనకడుగు వేశాయి. కాగా.. ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఊపందుకున్నాయి. వారాంతాన యూరోపియన్‌, అమెరికన్‌ మార్కెట్లు ర్యాలీ చేయగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ నెలకొంది. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా, మీడియా, రియల్టీ 0.7 శాతం చొప్పున ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, మెటల్‌ 0.8-0.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, టెక్‌ మహాంద్రా, యాక్సిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టైటన్‌, హిందాల్కో, విప్రో, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 3.3 శాతం క్షీణించగా, గ్రాసిమ్‌, గెయిల్‌, ఐబీ హౌసింగ్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, ఐషర్‌, యూపీఎల్‌, హీరో మోటో, బీపీసీఎల్‌ 2.6-1.2 శాతం మధ్య నీరసించాయి.

ఐడీబీఐ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడీబీఐ 12 శాతం దూసుకెళ్లగా.. దివాన్‌ హౌసింగ్‌, పీవీఆర్, బిర్లాసాఫ్ట్‌, జీఎంఆర్‌, జూబిలెంట్‌ ఫుడ్స్‌, కజారియా, నిట్‌ టెక్‌, గ్లెన్‌మార్క్‌ 6.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు ఐడియా, రిలయన్స్‌ కేపిటల్‌, బయోకాన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఉజ్జీవన్, ఎన్‌బీసీసీ, రేమండ్‌, మహానగర్‌ 7.8-2.6 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు జోరందుకోవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.2-0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1271 లాభపడగా.. 1211 వెనకడుగుతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1339 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1058 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇండిపెండెన్స్‌ సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1615 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు సైతం రూ. 1620 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.  tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');