దివాన్‌ హౌసింగ్‌- పెన్నార్‌.. భళా

దివాన్‌ హౌసింగ్‌- పెన్నార్‌.. భళా

రుణ భారం, లిక్విడిటీ సమస్యలతో కొద్ది రోజులుగా కుదేలైన ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఇటీవల ప్రతిపాదించిన రుణ క్రమబద్ధీకరణ(డెట్‌ రిజల్యూషన్‌) ప్రణాళికలకు బ్యాంకుల కన్సార్షియం అనుమతించినట్లు వెలువడిన వార్తలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మరోవైపు గత రెండు నెలల్లో రూ. 538 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందినట్లు వెల్లడించడంతో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఫైనాన్షియల్‌ సలహాదారు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సహకారంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను బ్యాంకుల కన్సార్షియం ఆమోదించినట్లు మీడియా పేర్కొంది. ఈ ప్రణాళిక ముసాయిదా ప్రకారం రుణదాతలు రుణ మొత్తాల(ప్రిన్సిపల్‌)కు కోత పెట్టనవసరం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే రుణ చెల్లింపులపై మారటోరియం విధించాలని దివాన్‌ కోరుతున్నట్లు పేర్కొన్నాయి. ఇదే విధంగా రిటైల్‌ రుణాల బిజినెస్‌ను తిరిగి ప్రారంభించేందుకు వీలుగా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు నుంచి తాజా క్రెడిట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రుణ వాయిదాల చెల్లింపు గడువులను పెంచడం తదితర అంశాలతో కూడిన ఈ ప్రణాళికను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం ఆమోదించవలసి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 6.5 శాతం జంప్‌చేసి రూ. 49 వద్ద ట్రేడవుతోంది.

Related image

పెన్నార్‌ ఇండస్ట్రీస్‌
వివిధ బిజినెస్‌ విభాగాల ద్వారా గత రెండు నెలల్లో మొత్తం రూ. 538 కోట్ల ఆర్డర్లను పొందినట్లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. ప్రిఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ డివిజన్‌ రూ. 211 కోట్లు, ట్యూబ్స్‌ విభాగం రూ. 77 కోట్లు, రైల్వేల వింగ్‌ నుంచి రూ. 66 కోట్లు చొప్పున ఆర్డర్లు లభించినట్లు తెలియజేసింది. కాగా ఆర్డర్లను ఏఎల్‌ఎఫ్‌ ఇంజినీరింగ్‌, ఎంజీ ఆటో, మారుతీ ఆటో, ఎమర్సన్‌, యమహా, వాబ్కో తదితర సుప్రసిద్ధ కంపెనీల నుంచి సంపాదించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 28 వద్ద ట్రేడవుతోంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');