గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ జూమ్‌

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ జూమ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా కౌంటర్‌ దూకుడు కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ షేరు మరోసారి భారీ లాభాలతో కళకళలాడుతోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 1065 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1089 వరకూ ఎగసింది. కాగా పటిష్ట ఫలితాల కారణంగా గత నాలుగు రోజుల్లో ఈ షేరు 53 శాతం దూసుకెళ్లింది. ఇతర వివరాలు చూద్దాం..

లాభం రెట్టింపు
గతేడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 119 కోట్లను తాకింది. ఇందుకు అమ్మకాల పరిమాణం పెరగడం దోహదం చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నిర్వహణ ఆదాయం సైతం 40 శాతం పుంజుకుని రూ. 841 కోట్లకు చేరింది. విదేశీ బిజినెస్‌ 77 శాతం పెరిగి రూ. 219 కోట్లను తాకడం పనితీరు మెరుగుకు సహకరించినట్లు కంపెనీ తెలియజేసింది. దేశీయంగా సిగరెట్ల విక్రయాలు 17 శాతం వృద్ధి చూపినట్లు కంపెనీ పేర్కొంది. ప్రొడక్ట్‌ మిక్స్‌, గరిష్ట రియలైజేషన్ల కారణంగా స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 7.1 శాతం నుంచి 10.7 శాతానికి బలపడ్డాయి. కంపెనీ బిజినెస్‌ను మరింత విస్తరించుకునే వ్యూహంలో భాగంగా దక్షిణాది మార్కెట్లపై దృష్టి సారించింది. ఇందుకు వీలుగా అమ్మకాలు, పంపిణీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');