ఐనియోస్‌కు డీలిస్టింగ్‌ కిక్‌

ఐనియోస్‌కు డీలిస్టింగ్‌ కిక్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను డీలిస్ట్‌ చేసేందుకు మాతృ సంస్థ సన్నాహాలు చేస్తున్న వార్తలతో స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రమోటర్లు వొలంటరీ డీలిస్టింగ్‌ ప్రతిపాదన చేసినట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తాజాగా ఐనియోస్‌ ఇండియా తెలియజేసింది. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 78 ఎగసి రూ. 467.55 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో బయ్‌ ఆర్డర్లు వెల్తువెత్తగా.. అమ్మేవాళ్లు కరువయ్యారు. ఇప్పటివరకూ సుమారు 5,000 షేర్లు చేతులుమారగా.. 9 లక్షలకుపైగా పెండింగ్‌ ఆర్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు చూద్దాం..

23న బోర్డ్‌ మీటింగ్‌
కంపెనీ మాతృ సంస్థ ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ ఏపీఏసీ ఈ నెల 16న షేర్లను డీలిస్ట్‌ చేసేందుకు ఆసక్తి వ్యక్త పరచినట్లు ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ ఇండియా లిమిటెడ్‌ పేర్కొంది. ఇందుకు అనుగుణంగా షేరుకి రూ. 480 ధరను సూచనప్రాయంగా ప్రకటించినట్లు తెలియజేసింది. ఇది ఈ నెల 14 నాటి ముగింపు ధర రూ. 390తో పోలిస్తే 23 శాతం ప్రీమియంకాగా.. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డు ఆగస్ట్ 23న సమావేశంకానున్నట్లు వెల్లడించింది. ప్రమోటర్లు 4.4 మిలియన్‌ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లు కంపెనీ వివరించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 25 శాతం వాటాకు సమానంకాగా.. షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. 

ఎగ్జిట్‌కు అవకాశం
పబ్లిక్‌కు గల వాటా కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలను మరింత పటిష్ట పరచనున్నట్లు ఐనియోస్‌ ఇండియా పేర్కొంది. ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం అతితక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది. టెండర్‌ మార్గంలో వాటాదారులు షేర్లను ఆఫర్‌ చేయవచ్చని తెలుస్తోంది. కాగా.. ఏడాది కాలంలో ఈ షేరు 43 శాతం పతనంకావడం గమనార్హం! tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');