ఫార్మా పుష్.. ట్రిపుల్‌ సెంచరీ

ఫార్మా పుష్.. ట్రిపుల్‌ సెంచరీ

కేంద్ర బ్యాంకుల సహాయక ప్యాకేజీలు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి సానుకూల వార్తల నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ ప్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత లాభాల డబుల్‌ సాధించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం ట్రిపుల్‌ సెంచరీని సైతం అందుకుంది. 308 పాయింట్లు ఎగసి 37,658కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్ల వృద్ధితో 11,133 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఊపందుకున్నాయి. వారాంతాన యూరోపియన్‌, అమెరికన్‌ మార్కెట్లు ర్యాలీ చేయగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ నెలకొంది. దేశీయంగానూ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డీలా
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.85 శాతం వెనకడుగులో ఉంది. ప్రధానంగా ఫార్మా 1.8 శాతం, రియల్టీ 1.2 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.8 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, టెక్‌ మహాంద్రా, అదానీ పోర్ట్స్‌ 3.3-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 2.3 శాతం క్షీణించగా, యూపీఎల్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, జీ, గెయిల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా 1-0.5 శాతం మధ్య నీరసించాయి.

దివాన్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో దివాన్‌ హౌసింగ్‌ 11 శాతం జంప్‌చేయగా.. ఐడీబీఐ, పీవీఆర్, జూబిలెంట్‌ ఫుడ్స్‌, కజారియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, హావెల్స్‌, టాటా పవర్ 7.5-3 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌, ఉజ్జీవన్, ఐడియా, ఎన్‌సీసీ, ఎన్‌బీసీసీ, ఒరాకిల్‌, కెనరా బ్యాంక్‌, స్టార్‌ 6.3-1.5 శాతం మధ్య తిరోగమించాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్‌ 5.6 శాతం జంప్‌చేయగా.. ఫీనిక్స్‌, ఒబెరాయ్‌, మహీంద్రా లైఫ్‌, సన్‌టెక్‌, డీఎల్‌ఎఫ్‌ 2-1.5 శాతం మధ్య పెరిగాయి.

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు జోరందుకోవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1242 లాభపడగా.. 948 మాత్రమే వెనకడుగులో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఐనియోస్‌ 20 శాతం దూసుకెళ్లగా.. ఫోర్స్‌, వాటార్‌బేస్‌, జీవీకే, హాథవే, సిల్‌ ఇన్వెస్ట్‌, చెవియట్‌, అహ్లువాలియా, పెన్నార్‌ ఇండస్ట్రీస్‌, సుబ్రోస్, కేఎన్‌ఆర్, సిగ్నిటీ, డెన్‌నెట్‌ తదితరాలు 15-6 శాతం మధ్య జంప్‌చేశాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');