సన్‌ ఫార్మా- క్యుపిడ్‌.. ఖుషీ

సన్‌ ఫార్మా- క్యుపిడ్‌.. ఖుషీ

చైనాలో ప్రొడక్టుల అభివృద్ధి, విక్రయాల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో దేశీ హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క ఐక్యరాజ్యసమితి విభాగం నుంచి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో కండోమ్స్‌ తయారీ కంపెనీ క్యుపిడ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

సన్‌ ఫార్మాస్యూటికల్స్‌
చైనాలో దేశవ్యాప్తంగా జనరిక్‌ ప్రొడక్టుల అభివృద్ధి, విక్రయాలకు వీలుగా అక్కడి సంస్థ చైనా మెడికల్‌ సిస్టమ్స్‌ హోల్డింగ్స్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెల్త్‌కేర్‌ రంగ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది. తద్వారా ఏడు జనరిక్‌ ప్రొడక్టులను అభివృద్ధి చేసి, చైనాలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సన్ ఫార్మా షేరు 3.4 శాతం జంప్‌చేసి రూ. 429 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 434 వరకూ ఎగసింది. 

Image result for cupid ltd

క్యుపిడ్‌ లిమిటెడ్‌
ఉగాండాకు కండోమ్స్‌ సరఫరా చేసేందుకు యునైటెడ్‌ నేషన్స్‌ పాప్యులేషన్‌ ఫండ్‌(యూఎన్‌ఎఫ్‌పీఏ) నుంచి ఆర్డర్ లభించినట్లు క్యుపిడ్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. పురుష కండోమ్స్‌ సరఫరా కోసం పొందిన ఈ ఆర్డర్‌ విలువ రూ. 14.1 కోట్లుగా తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం ఊపందుకుంది. గత రెండు వారాల సగటు 5,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ బీఎస్‌ఈలో 11,200 షేర్లకుపైగా చేతులు మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో క్యుపిడ్‌ లిమిటెడ్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 133 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 139 వరకూ ఎగసింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');