స్టిములస్‌ ఆశలు- ఆసియా అప్‌

స్టిములస్‌ ఆశలు- ఆసియా అప్‌

ఓవైపు జర్మనీ, మరోపక్క చైనా ప్రభుత్వాలు ఆర్థిక మందగమన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా చర్యలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా కొంతమేర సెంటిమెంటు బలపడింది. ఇప్పటికే యూరోపియన్ సెంట్రల్‌ బ్యాంక్‌ సహాయక ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. శనివారం పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లలో కోతల సన్నాహాలు ప్రకటించింది. శుక్రవారం జర్మన్‌ ప్రభుత్వం బ్యాలన్స్‌డ్‌ బడ్జెట్‌ను వీడి సహాయక ప్యాకేజీలకు తెరతీయనున్నట్లు ప్రకటించడంతో వారాంతాన అటు యూరప్‌, ఇటు అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది.  

డాలరు ప్లస్‌లో
ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ సానుకూలంగా కదులుతున్నాయి. హాంకాంగ్‌ 2 శాతం, చైనా 1.2 శాతం  చొప్పున జంప్‌చేయగా.. తైవాన్‌, కొరియా, జపాన్, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.7-0.3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ప్రపంచ కేంద్ర బ్యాంకుల ఉద్దీపన చర్యల అంచనాలతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.33కు పుంజుకుంది. ఇది రెండు వారాల గరిష్టంకాగా.. ఇందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం వడ్డీ రేట్ల తగ్గింపువైపు మొగ్గు చూపవచ్చన్న అంచాలు, హాంకాంగ్‌లో నిరసనలు, అర్జెంటీనా రాజకీయ సంక్షోభం వంటి అంశాలు కారణంకాగా.. రక్షణాత్మక కరెన్సీగా భావించే జపనీస్‌ యెన్‌ మూడో రోజూ నీరసించింది. 106.44కు చేరింది. ఇక యూరో 1.108వద్ద ట్రేడవుతోంది.10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ మూడేళ్ల కనిష్టం 1.475 శాతం నుంచి 1.575 శాతానికి మెరుగుపడ్డాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');