గత వారం నష్టాల మధ్యే నడక

గత వారం నష్టాల మధ్యే నడక

గడిచిన వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనప్పటికీ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. బక్రీద్‌ సందర్భంగా సోమవారం, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మార్కెట్లు పనిచేయలేదు. మంగళవారం సెన్సెక్స్‌ 625 పాయింట్లు పడిపోగా.. బుధవారం 350 పాయింట్లు ఎగసింది. తిరిగి శుక్రవారం ఒడిదొడుకుల మధ్య స్వల్పంగా 40 పాయింట్లు జమ చేసుకుంది. వెరసి గత వారం సెన్సెక్స్‌ నికరంగా 232 పాయింట్లు(0.6 శాతం) క్షీణించింది. 37,350 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 62 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 11,048 వద్ద స్థిరపడింది. కాగా.. ఇంట్రాడేలో పలుమార్లు సెన్సెక్స్‌ 37,000, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు చేరడం గమనార్హం!

చిన్న షేర్లూ డీలా
మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా షేర్లలోనూ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.3 శాతం నష్టంతో 13,491 వద్ద ముగిసింది. స్మాల్‌ క్యాప్‌ 0.9 శాతం వెనకడుగుతో 12,585 వద్ద నిలిచింది. బ్లూచిప్‌ కౌంటర్లలో ఆర్‌ఐఎల్‌ 10 శాతం, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఎన్‌టీపీసీ 5 శాతం పతనమైంది.

గాడ్‌ఫ్రే ఫిలిప్‌ జోరు
చిన్న షేర్లలో గాడ్‌ఫ్రే ఫిలిప్‌, డీఐఎల్‌, డిక్సన్‌, సూపర్‌హౌస్‌, భారత్‌ రసాయన్‌, కొచిన్‌ మినరల్స్‌, సుప్రజిత్‌, హెచ్‌సీజీ 41-16 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క బిర్లా కేబుల్‌, సారేగామా, శిల్పా మెడికేర్‌, కిల్‌టిచ్‌, తాజ్‌ జీవీకే, పాండీ ఆక్సైడ్‌, జీఐసీ హౌసింగ్‌, గణేశ్‌ హౌసింగ్‌, ఎస్సెల్‌ ప్రొప్యాక్‌, ఐజీ పెట్రోకెమ్ 33-17 శాతం మధ్య పతనమయ్యాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');