యూఎస్‌ మార్కెట్లకు జర్మన్‌ జోష్‌

యూఎస్‌ మార్కెట్లకు జర్మన్‌ జోష్‌

ఆర్థిక మందగమన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జర్మన్‌ ప్రభుత్వం సహాయక ప్యాకేజీలకు తెరతీయనున్నట్లు ప్రకటించడంతో వారాంతాన అటు యూరప్‌, ఇటు అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌, జర్మనీ 1.25 శాతం చొప్పున పుంజుకోగా.. యూకే 0.7 శాతం బలపడింది. ఈ బాటలో డోజోన్స్‌ 307 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 25,886 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 41 పాయింట్లు(1.45 శాతం) పురోగమించి 2,889 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 129 పాయింట్లు (1.7 శాతం) జంప్‌చేసి 7,896 వద్ద స్థిరపడింది.

Image result for general electricImage result for nvidia logo
 
వెనకడుగే..
శుక్రవారం మార్కెట్లు రికవర్‌ అయినప్పటికీ నికరంగా గత వారం డోజోన్స్‌1.5 శాతం, ఎస్‌అండ్‌పీ 1 శాతం చొప్పున క్షీణించాయి. ఆగస్ట్‌ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్‌ 3.6 శాతం వెనకడుగు వేసింది! అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడనున్న అంచనాలతో గత వారం మధ్యలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మాంద్య పరిస్థితులను సూచిస్తూ బాండ్ల ఈల్డ్స్‌ కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనయ్యారు. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ మూడేళ్ల కనిష్టం 1.538 శాతానికి నీరసించడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు నిపుణులు తెలియజేశారు. 

Image result for deere & co
జీఈ- బ్యాంక్స్‌ అండ
ముందురోజు భారీగా పతనంకావడంతో 2 మిలియన్‌ డాలర్లతో కంపెనీ షేర్లను సీఈవో లారీ కల్ప్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఇంజినీరింగ్‌ దిగ్గజం జనరల్‌ ఎలక్ట్రిక్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణలతో గత 11 ఏళ్లలోలేని విధంగా గురువారం జీఈ షేరు కుప్పకూలిన విషయం విదితమే. తాజాగా బాండ్ల ఈల్డ్స్‌ కోలుకున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ పుంజుకున్నాయి. సిటీగ్రూప్‌ 3.5 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా  3 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా.. అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో చిప్‌ తయారీ దిగ్గజం ఎన్‌విడియా కార్ప్‌ షేరు 7.3 శాతం జంప్‌చేసింది. వాణిజ్య వివాదాల కారణంగా పనితీరు మందగించినప్పటికీ.. వ్యయాల అదుపును ప్రకటించడంతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల దిగ్గజం డీరే అండ్‌ కో 4 శాతం ఎగసింది. Most Popular