డోజోన్స్‌ బాటలో- బ్యాంక్స్‌, ఆటో అప్‌

డోజోన్స్‌ బాటలో- బ్యాంక్స్‌, ఆటో అప్‌

నేలచూపుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. నష్టాలను పూడ్చుకుని లాభాలలోకి ప్రవేశించాయి. ఆపై స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 39 పాయింట్లు బలపడి 37,350 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11,048 వద్ద ముగిసింది. ఆర్థిక మాంద్యానికి సంకేతంగా ఇటీవల బాండ్ల ఈల్డ్స్‌ పతనమవుతుండటంతో బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ డోజోన్స్‌ 800 పాయింట్లు కుప్పకూలింది. అయితే గురువారం తిరిగి స్వల్పంగా కోలుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం బలహీనంగా ప్రారంభమై వెనువెంటనే పతన బాట పట్టాయి. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా గురువారం దేశీ మార్కెట్లకు సెలవుకాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలుత సెన్సెక్స్‌ 330 పాయింట్లకుపైగా పతనమైంది. కనిష్టంగా 36,974కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 105 పాయింట్లు కోల్పోయి 10,924 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. 

ఫార్మా, ఐటీ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో 1.2 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఐటీ, ఫార్మా 0.7 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, యస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్, గెయిల్‌, ఐబీ హౌసింగ్‌, యాక్సిస్, ఐటీసీ 4.5-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే టీసీఎస్‌, వేదాంతా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, ఆర్‌ఐఎల్‌ 2-0.8 శాతం మధ్య క్షీణించాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా 14 శాతం దూసుకెళ్లగా.. అపోలో హాస్పిటల్స్‌, కెనరా, పీఎన్‌బీ, ఒరాకిల్‌, ఐజీఎల్‌, సీఈఎస్‌సీ, పీఎఫ్‌సీ, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ 8-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడీబీఐ 9 శాతం కుప్పకూలగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, గ్లెన్‌మార్క్‌, ఎన్‌బీసీసీ, పీవీఆర్‌, ఎన్‌సీసీ, నిట్‌ టెక్‌, యూబీఎల్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, సెయిల్‌ 6.5-2.2 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లకు ఓమాదిరి డిమాండ్‌ పుట్టింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.1 శాతం చొప్పున బలపడ్డాయి. మొత్తం 1195 షేర్లు లాభపడగా..  1299 షేర్లు నష్టపోయాయి.  

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
గురువారం ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1615 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. మరోపక్క దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 1620 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా..  మంగళవారం  ఎఫ్‌పీఐలు రూ. 638 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 201 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. బక్రీద్‌ నేపథ్యంలో సోమవారం మార్కెట్లు పనిచేయలేదు.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');