అమ్మకాల సెగ- చితికిన చిన్న షేర్లు

అమ్మకాల సెగ- చితికిన చిన్న షేర్లు

ప్రపంచ దేశాలను మరోసారి ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెట్టవచ్చన్న ఆందోళనలు పెరుగుతుండటంతో అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ బాటలో తొలుత పతన బాటలో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి కోలుకున్నాయి. నష్టాల నుంచి బయటపడి లాభాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన చిన్న, మధ్యతరహా కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో సారేగామా ఇండియా, కైటెక్స్‌ గార్మెంట్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చోటుచేసుకున్నాయి. వివరాలు చూద్దాం..

సారేగామా ఇండియా: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం కుప్పకూలింది. రూ. 359 దిగువకు చేరింది. తొలుత ఒక దశలో రూ. 347 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2900 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 94,000 షేర్లు చేతులు మారాయి.

కైటెక్స్‌ గార్మెంట్స్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం కుప్పకూలింది. రూ. 81 దిగువకు చేరింది. తొలుత ఒక దశలో రూ. 79 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3300 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 15,000 షేర్లు చేతులు మారాయి.

ఆర్తి ఇండస్ట్రీస్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతం పడిపోయి రూ. 1598 వద్దకు చేరింది. ఒక దశలో రూ. 1595 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 15,500 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 12,200 షేర్లు చేతులు మారాయి.

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: ఎన్‌బీఎఫ్‌సీ రంగ ఈ సంస్థ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.5 శాతం పతనమై రూ. 133 వద్దకు చేరింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ బీఎస్ఈలో 79,000 షేర్లు చేతులు మారాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');