అపోలో జూమ్‌- గ్లెన్‌మార్క్‌ బోర్లా

అపోలో జూమ్‌- గ్లెన్‌మార్క్‌ బోర్లా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు మూడేళ్ల గరిష్టాన్ని తాకింది. కాగా.. మరోవైపు విదేశీ రీసెర్చ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో హెల్త్‌కేర్‌ రంగ సంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో గ్లెన్‌మార్క్‌ షేరు 8 ఏళ్ల కనిష్టాన్ని చవిచూసింది. వివరాలు చూద్దాం.. 

Image result for apollo hospital

అపోలో హాస్పిటల్స్‌
ఈ ఏడాది క్యూ1లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతంపైగా దూసుకెళ్లి రూ. 1458 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1466 వరకూ ఎగసింది. 2016 మార్చి తదుపరి ఇది గరిష్టంకావడం విశేషం. కాగా.. క్యూ1లో అపోలో నికర లాభం 68 శాతం ఎగసి రూ. 57 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పుంజుకుని రూ. 2572 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 56 శాతం పెరిగి రూ. 364 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 10.5 శాతం నుంచి 14.1 శాతానికి బలపడ్డాయి. దీంతో బుధవారం సైతం ఈ షేరు దాదాపు 3 శాతం లాభపడింది.

Image result for glenmark pharmaceuticals

గ్లెన్‌మార్క్‌ ఫార్మా
ఈ ఏడాది క్యూ1లో గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 109 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 2323 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో విదేశీ బ్రోకింగ్‌ సంస్థలు క్రెడిట్‌ స్వీస్‌, సీఎల్‌ఎస్ఏ షేరుకి సెల్‌ రేటింగ్‌ను ప్రకటించాయి. క్రెడిట్‌ స్వీస్‌ గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను రూ. 600 నుంచి రూ. 415కు కోత పెట్టగా.. సీఎల్‌ఎస్‌ఏ సైతం రూ. 500 టార్గెట్‌ను రూ. 350కు కుదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) ఈపీఎస్‌ అంచనాలను 15-18 శాతంమేర తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో గ్లెన్‌మార్క్‌ షేరు 7 శాతం పతనమై రూ. 358 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 356 వద్ద 8 ఏళ్ల కనిష్టాన్ని తాకింది. వెరసి 2012 జూన్‌ స్థాయికి షేరు ధర చేరింది. గత 9 నెలల్లో ఈ కౌంటర్‌ 45 శాతం తిరోగమించడం గమనార్హం! tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');