టర్న్‌అరౌండ్‌- ఐటీ, ఫార్మా వీక్‌

టర్న్‌అరౌండ్‌- ఐటీ, ఫార్మా వీక్‌

నేలచూపుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. నష్టాలను పూడ్చుకుని స్వల్ప లాభాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 33 పాయింట్లు పుంజుకుని 37,344కు చేరగా.. నిఫ్టీ 9 పాయింట్లు బలపడి 11,038 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తూ బాండ్ల ఈల్డ్స్‌ పతనంకావడంతో బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ డోజోన్స్‌ 800 పాయింట్లు కుప్పకూలింది. గురువారం యూఎస్‌ మార్కెట్లు నామమాత్రంగా కోలుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమై వెను వెంటనే పతన బాట పట్టాయి. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా గురువారం దేశీ మార్కెట్లకు సెలవుకాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలుత సెన్సెక్స్‌ 330 పాయింట్లకుపైగా పతనమైంది. కనిష్టంగా 36,974కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 105 పాయింట్లు కోల్పోయి 10,924 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. 

మెటల్స్ డీలా
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో రంగాలు 0.4 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ, ఫార్మా, మెటల్‌ 1 శాతం స్థాయిలో బోర్లా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 6 శాతం పతనంకాగా.. టీసీఎస్‌, వేదాంతా, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో 2-0.7 శాతం మధ్య క్షీణించాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 5.5 శాతం జంప్‌చేయగా.. యూపీఎల్‌, గెయిల్‌, గ్రాసిమ్‌, మారుతీ, యాక్సిస్, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ 4-1.2 శాతం మధ్య ఎగశాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడీబీఐ 8.5 శాతం కుప్పకూలగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, గ్లెన్‌మార్క్‌, పీవీఆర్‌, బయోకాన్‌, ఎన్‌సీసీ, డిష్‌ టీవీ, నిట్‌ టెక్‌ 7-2.25 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐడియా 16  శాతం దూసుకెళ్లగా.. అపోలో హాస్పిటల్స్‌, రిలయన్స్‌ కేపిటల్‌, సీఈఎస్‌సీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, ముత్తూట్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. 

చిన్న షేర్లు ..
మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాలు తగ్గాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.15 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ 1205 షేర్లు నష్టపోగా.. 996 లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఈస్టర్‌, యుకాల్‌ ఫ్యూయల్‌, ఎస్‌ఎంఎల్‌, నేషనల్‌ పెరాక్సైడ్‌, పటేల్‌, గర్వారే టెక్నికల్‌, టీబీజెడ్‌, నెల్‌క్యాస్ట్, టీఎన్‌పీఎల్‌, జాన్సన్‌ కంట్రోల్స్‌, ధంపూర్, జీపీటీ, డీఐఎల్‌ తదితరాలు 16-5 శాతం మధ్య దూసుకెళ్ళాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');