యస్ బ్యాంక్‌ భళా.. హెచ్‌ఈజీ డీలా

యస్ బ్యాంక్‌ భళా.. హెచ్‌ఈజీ డీలా

అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌) ద్వారా నిధుల సమీకరణను విజయవంతంగా పూర్తిచేసినట్లు వెలువడిన వార్తలు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. కాగా.. మరోవైపు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ సంస్థ హెచ్‌ఈజీ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి యస్ బ్యాంక్‌ షేరు లాభాలతో సందడి చేస్తోంటే.. హెచ్‌ఈజీ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ద్వారా రూ. 1,900 కోట్ల పెట్టుబడులను సమీకరించినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. గత వారం నిర్వహించిన క్విప్‌లో భాగంగా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్‌) 23.1 కోట్ల షేర్లను జారీ చేసినట్లు తెలియజేసింది. షేరుకి రూ. 83.55  ధరలో వీటిని కేటాయించినట్లు వెల్లడించింది. తద్వారా బ్యాంక్‌ సీఏఆర్ 16.2 శాతాన్ని తాకినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 5 శాతం జంప్ చేసి రూ. 80 వద్ద ట్రేడవుతోంది. 

Image result for heg ltd

హెచ్‌ఈజీ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ కంపెనీ హెచ్‌ఈజీ లిమిటెడ్‌ నికర లాభం 69 శాతం క్షీణించి రూ. 243.5 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 49 శాతం వెనకడుగుతో రూ. 817 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌ఈజీ షేరు ఎన్‌ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 958 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 926 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 45,000కాగా.. ఇప్పటివరకూ 51,000 షేర్లు చేతులు మారాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');