ఆర్‌కేపిటల్‌- పీఎఫ్‌సీ.. ఖుషీ

ఆర్‌కేపిటల్‌- పీఎఫ్‌సీ.. ఖుషీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించడంతో అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్ కేపిటల్‌ లిమిటెడ్‌(ఆర్‌కేపిటల్‌) కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో పీఎస్‌యూ కంపెనీ పవర్‌  ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(పీఎఫ్‌సీ) కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..  

రిలయన్స్‌ కేపిటల్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ సంస్థ రిలయన్స్ కేపిటల్‌ లిమిటెడ్‌ నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 1218 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 31 శాతం పుంజుకుని రూ. 6083 కోట్లకు చేరింది. అయితే స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 116 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం క్షీణించి రూ. 513 కోట్లకు పరిమితమైంది. అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ కేపిటల్‌లో ప్రమోటర్లకు 41.71 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం రిలయన్స్‌ కేపిటల్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 7.5 శాతం జంప్‌చేసి రూ. 51 వద్ద ట్రేడవుతోంది. 

Image result for power finance corporation

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
విద్యుత్‌ రంగ ప్రభుత్వ కంపెనీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రూ. 2900 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది నామమాత్ర వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ. 14,608 కోట్లను తాకింది. అయితే స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం దాదాపు యథాతథంగా  రూ. 1383 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 1384 కోట్లకు చేరింది. పీఎస్‌యూ కంపెనీ పీఎఫ్‌సీ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 59.05 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం పీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్ఈలో 2.5 శాతం లాభపడి రూ. 109 వద్ద ట్రేడవుతోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');