ఇంద్రప్రస్థ- టిటాగఢ్‌.. ప్లస్‌లో

ఇంద్రప్రస్థ- టిటాగఢ్‌.. ప్లస్‌లో

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సిటీ గ్యాస్‌ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌(ఐజీఎల్‌) కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు మహారాష్ట్ర మెట్రోరైల్‌ నుంచి కాంట్రాక్ట్‌ లభించినట్లు వెల్లడించడంతో ఇంజినీరింగ్‌ సంస్థ టిటాగఢ్‌ వేగన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సీఎన్‌జీ సేవలందించే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌ నికర లాభం 31 శాతం ఎగసి రూ. 245 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 23 శాతం పుంజుకుని రూ. 1779 కోట్లను తాకింది. సీఎన్‌జీ విక్రయాలు 25 శాతం వృద్ధితో రూ. 1340 కోట్లకు చేరగా.. పీఎన్‌జీ అమ్మకాలు సైతం 16 శాతం పెరిగి రూ. 398 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఐజీఎల్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 3 శాతం లాభంతో రూ. 326 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 330ను సైతం అధిగమించింది.

Image result for titagarh wagons limited

టిటాగఢ్‌ వేగన్స్‌ లిమిటెడ్‌
సొంత అనుబంధ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కన్సార్షియం మహారాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి ప్యాసింజర్‌ రోలింగ్‌ స్టాక్‌ సరఫరాకు ఆర్డర్‌ను పొందినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ టిటాగఢ్‌ వేగన్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఆర్డర్‌ విలువను రూ. 1125 కోట్లుగా అంచనా వేసింది. దీనిలో భాగంగా పుణే మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్ల డిజైన్‌, తయారీ, సరఫరా, టెస్టింగ్‌తోపాటు శిక్షణ తదితర సర్వీసులను అందించవలసి ఉంటుందని తెలియజేసింది. రైల్‌ కోచ్‌ల తయారీ ఈ కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 45.71% వాటా ఉంది. కాంట్రాక్ట్‌ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టిటాగఢ్‌ వేగన్స్‌ షేరు 2.3 శాతం లాభంతో రూ. 42 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 44 వరకూ ఎగసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');