ఐబీ హౌసింగ్‌- ఐడీబీఐ పతనం

ఐబీ హౌసింగ్‌- ఐడీబీఐ పతనం

విదేశీ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ దీర్ఘకాలిక కార్పొరేట్‌ సౌకర్యాల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో  పీఎస్‌యూ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ దీర్ఘకాలిక కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ను Ba1 నుంచి Ba2కు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అంతేకాకుండా కంపెనీ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించింది. కంపెనీ విదేశీ కరెన్సీ సీనియర్ సెక్యూర్డ్‌ రేటింగ్‌ను సైతం మూడీస్‌ ఇదే విధంగా డౌన్‌గ్రేడ్‌ చేసింది. నిధుల వ్యయాలు, అందుబాటు అంశాలలో ఒత్తిడి కారణంగా రేటింగ్‌లో మార్పులు చేపట్టినట్లు మూడీస్‌ వివరించింది. దీంతో ఈ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు దాదాపు 9 శాతం కుప్పకూలి రూ. 504 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 498 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. 

Image result for idbi bank

ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌ రూ. 3801 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 2409 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం సైతం 11 శాతం తక్కువగా రూ. 1458 కోట్లకు పరిమితమైంది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.6 శాతం పెరిగి 29.1 శాతాన్ని తాకగా.. నికర ఎన్‌పీఏలు మాత్రం 10.1 శాతం నుంచి 8 శాతానికి వెనకడుగు వేశాయి. కాగా.. రూ. 10,000 కోట్ల సమీకరణకు వీలుగా బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీతో కంపెనీ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో కీలకంకాని ఆస్తుల విక్రయం ద్వారా రూ. 1500 కోట్లవరకూ సమకూర్చుకోవాలని బ్యాంక్‌ భావిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం పతనమై రూ. 25 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 24 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');