యూఎస్‌- పతనం నుంచి పైకి!

యూఎస్‌- పతనం నుంచి పైకి!

అమ్మకాలు వెల్లువెత్తడంతో బుధవారం భారీగా పతనమైన అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం కొంతమేర కోలుకున్నాయి. జులైలో రిటైల్‌ అమ్మకాలు జోరందుకోవడంతోపాటు.. రిటైల్‌ స్టోర్ల దిగ్గజం వాల్‌మార్ట్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సెంటిమెంటు బలపడింది. వెరసి గురువారం డోజోన్స్‌ 100 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 25,579 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 7 పాయింట్లు(0.25 శాతం) బలపడి 2,848 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ నామమాత్రంగా 7 పాయింట్లు (0.01 శాతం) లాభపడి 7,767 వద్ద స్థిరపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడనున్న అంచనాలతో బుధవారం మార్కెట్లు కుప్పకూలాయి. డోజోన్స్‌ 800 పాయింట్లు(3 శాతం) పతనమైంది. 2019లో ఇది అత్యధిక నష్టంకాగా.. బాండ్ల ఈల్డ్స్‌ మాంద్య పరిస్థితులను సూచించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనైనట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌   మూడేళ్ల కనిష్టం 1.538 శాతానికి నీరసించడంతో రెసిషన్‌ భయాలు తలెత్తినట్లు తెలియజేశాయి.

Image result for walmart

ఆదుకున్న వాల్‌మార్ట్‌
అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలకు జతగా పూర్తి ఏడాదికి ప్రోత్సాహకర అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించడంతో రిటైల్‌ రంగ దిగ్గజం వాల్‌మార్ట్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఈ షేరు 6 శాతం జంప్‌చేసింది. కాగా.. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు అమ్మకాలను ప్రభావితం చేస్తున్నట్లు టెక్నాలజీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌ పేర్కొంది. చైనా ఆదాయం 25 శాతం క్షీణించనున్నట్లు తెలియజేసింది. దీంతో సిస్కో షేరు 8.6 శాతం పతనమైంది. కాగా.. మరోపక్క విజిల్‌బ్లోయర్‌ హ్యారీ ఆరోపణల కారణంగా ఇంజినీరింగ్‌ దిగ్గజం జనరల్‌ ఎలక్ట్రిక్‌ షేరు 11.3 శాతం కుప్పకూలింది.

Image result for general electricImage result for cisco
 
యూరప్‌ వీక్
గురువారం యూరోపియన్‌ మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. ఫ్రాన్స్‌ 0.3 శాతం, జర్మనీ 0.7 శాతం, యూకే 1.2 శాతం చొప్పున నీరసించాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ నెలకొంది. కొరియా, సింగపూర్‌ 0.9 శాతం చొప్పున క్షీణించగా.. థాయ్‌లాండ్‌, చైనా, హాంకాంగ్‌, తైవాన్‌ 0.6 శాతం స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇండొనేసియా 0.25 శాతం బలపడగా.. జపాన్‌ నామమాత్ర లాభంతో ట్రేడవుతోంది. కాగా.. డాలరు ఇండెక్స్‌ స్వల్ప వెనకడుగుతో 97.93కు చేరగా.. చైనీస్‌ యువాన్‌ 7.03 వద్ద, యూరో 1.114 వద్ద, జపనీస్‌ యెన్‌ 105.93 వద్ద ట్రేడవుతున్నాయి.Most Popular