లిండే జోష్‌.. నాల్కో కుదేల్‌

లిండే జోష్‌.. నాల్కో కుదేల్‌

దక్షిణాదిలోగల బిజినెస్‌ల విక్రయానికి ఎయిర్‌ వాటర్‌ ఇండియాతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ కంపెనీ లిండే ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో మెటల్‌ రంగ పీఎస్‌యూ.. నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లిండే ఇండియా లాభాలతో కళకళలాడుతుంటే.. నాల్కో లిమిటెడ్‌ షేరు నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

లిండే ఇండియా
దేశ దక్షిణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బిజినెస్‌లను విక్రయించేందుకు ఎయిర్‌ వాటర్‌ ఇంక్‌తో బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు లిండే ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా ఆక్సిజన్‌, నైట్రోజన్‌ తదితర వివిధ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ తయారీ, పంపిణీ, విక్రయ బిజినెస్‌లను విక్రయించనున్నట్లు వివరించింది. రోజుకి 1800 టన్నుల సామర్థ్యం కలిగిన కర్ణాటక బళ్లారిలోగల ఆన్‌సైట్‌ ఎయిర్‌ సెపరేషన్‌ ప్లాంటుతోపాటు హైదరాబాద్‌, చెన్నైలలోగల సిలిండర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లను ఎయిర్‌ వాటర్‌ ఇండియాకు బదిలీ చేయనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ఈ రెండు ప్రాంతాలలోనూ గల మిగులు భూములు సైతం డీల్‌లో భాగంగా  చేర్చినట్లు తెలియజేసింది. హైదరాబాద్‌లో మూసివేసిన ఎయిర్‌ సెపరేషన్‌ యూనిట్‌ స్థలాన్ని సైతం విక్రయిస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లిండే ఇండియా షేరు 6.4 శాతం జంప్‌చేసి రూ. 515 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 525 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Image result for national aluminium company limited

నాల్కో లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో అల్యూమినియం కంపెనీ నాల్కో లిమిటెడ్‌ నికర లాభం 86 శాతం నీరసించి రూ. 98 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 30 శాతం తక్కువగా రూ. 2084 కోట్లకు  చేరింది. నిర్వహణ లాభం 79 శాతం క్షీణించి రూ. 214 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 34 శాతం నుంచి 10.3 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో నాల్కో లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.2 శాతం పతనమై రూ. 41 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 39.3 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');