డా. రెడ్డీస్‌ డౌన్‌- డా. లాల్‌ పాథ్‌ ప్లస్‌

డా. రెడ్డీస్‌ డౌన్‌- డా. లాల్‌ పాథ్‌ ప్లస్‌

కాంట్రాసెప్టివ్‌(గర్భనిరోధక) ఔషధానికి సంబంధించి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(USFDA) కంప్లీట్ రెస్పాన్స్‌ లెటర్‌(CRL)ను జారీ చేసినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ షేరు నష్టాలతో కళతప్పింది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ సేవల సంస్థ డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో ఈ షేరు లాభాలతో ట్రేడవుతోంది. వివరాలు చూద్దాం..

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌
నువారింగ్‌ కాంట్రాసెప్టివ్‌ జనరిక్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ CRLను జారీ చేసినట్లు హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తాజాగా పేర్కొంది. ప్రస్తుత మార్కెటింగ్‌ విధానంలో కొత్త లేదా జనరిక్‌ ఔషధానికి అనుమతి నిరాకరించినప్పుడు సాధారణంగా సీఆర్‌ఎల్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ జారీ చేస్తుందని ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. సీఆర్‌ఎల్‌ జారీపై తగిన విధంగా స్పందించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 2481 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం పతనమైంది. రూ. 2351 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది.

Image result for dr lal path lab

డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌ నికర లాభం 19 శాతం పెరిగి రూ. 59 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పుంజుకుని రూ. 350 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన సైతం నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 57 కోట్లను తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 56.91 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 1108 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');