నేలక్కొట్టిన బంతి.. మార్కెట్‌

నేలక్కొట్టిన బంతి.. మార్కెట్‌

వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అమెరికా ప్రభుత్వం వెనకడుగు వేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. చైనా దిగుమతులపై టారిఫ్‌ల విధింపును వాయిదా వేస్తున్నట్లు యూఎస్‌ వాణిజ్య శాఖ పేర్కొనడంతో మంగళవారం అమెరికా మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌కాగా..  ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ లాభపడ్డాయి. ఈ ప్రభావంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ మార్కెట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరింత జోరందుకున్నాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ హైజంప్‌ చేస్తోంది. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 430 పాయింట్లు పెరిగి 37,388కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 125 పాయింట్ల లాభంతో 11,051 వద్ద ట్రేడవుతోంది. దశాబ్ద కాలం తదుపరి మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో సోమవారం ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. 

ఫార్మా పతనం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, మెటల్‌, బ్యాంక్స్‌, ఆటో రంగాలు 2.4-1 శాతం మధ్య పుంజుకోగా.. ఫార్మా 2.3 శాతం పతనమైంది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, టాటా స్టీల్‌, యూపీఎల్‌, వేదాంతా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, హిందాల్కో, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌ 6-3 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్‌ ఫార్మా 5.6 శాతం పతనంకాగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, కోల్‌ ఇండియా, విప్రో, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, బ్రిటానియా 3.2-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఆర్‌ఇన్‌ఫ్రా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 8.3 శాతం జంప్‌చేయగా.. శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఐడియా, అపోలో హాస్పిటల్స్‌, డిష్‌ టీవీ, జిందాల్‌ స్టీల్‌ 5.5-3.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క గ్లెన్‌మార్క్‌ 7.6 శాతం పతనంకాగా.. నాల్కో, ఎన్‌సీసీ, బాలకృష్ణ, లుపిన్‌, స్టార్‌, మైండ్‌ట్రీ 5-2 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలోనూ కొనుగోళ్లు నమోదవుతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ 1065 షేర్లు లాభపడగా.. 938 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో న్యూలాండ్‌, హెచ్‌సీజీ, ఈస్టర్‌, హాథవే, జెనిసిస్, పంజాబ్‌ కెమ్‌, విమ్‌ప్లాస్ట్‌, సంగమ్‌, జీ లెర్న్‌, టీఎఫ్‌సీఐ, సన్‌టెక్‌, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, సోరిల్‌, 5పైసా తదితరాలు 11-5 శాతం మధ్య పెరిగాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');