ఆర్‌ ఇన్‌ఫ్రా.. రెయిన్‌- క్యూ1 జోష్‌

ఆర్‌ ఇన్‌ఫ్రా.. రెయిన్‌- క్యూ1 జోష్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఈ బాటలో మరోపక్క.. ప్రస్తుత ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరుత్సాహకర పనితీరు చూపినప్పటికీ కాల్సైన్‌డ్‌ పెట్రోలియం కోక్‌ తయారీ కంపెనీ రెయిన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ రూ. 299 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 20 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 5467 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 13 శాతం పెరిగి రూ. 636 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 10.5 శాతం నుంచి 11.6 శాతానికి మెరుగుపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 48 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 51 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Image result for rain industries limited

రెయిన్‌ ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ప్రయివేట్ రంగ కంపెనీ రెయిన్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 52 శాతం నీరసించి రూ. 147 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 12 శాతం తక్కువగా రూ. 33342 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 40 శాతం క్షీణించి రూ. 420 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 18.3 శాతం నుంచి 12.7 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.2 శాతం పుంజుకుని రూ. 85 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 88 వరకూ ఎగసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');