లాభాలలో.. ఫార్మాకు  ఫీవర్‌

లాభాలలో.. ఫార్మాకు  ఫీవర్‌

ఉన్నట్టుండి అమెరికా ప్రభుత్వం చైనా దిగుమతులపై టారిఫ్‌ల విధింపులో వెనకడుగు వేయడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లకు రిలీఫ్ వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు కొంతమేర ఉపశమించడంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 113 పాయింట్లు పెరిగి 37,071కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 35 పాయింట్ల లాభంతో 10,961 వద్ద ట్రేడవుతోంది. దశాబ్ద కాలం తదుపరి మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో సోమవారం దేశీ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. 

మీడియా, మెటల్స్ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, మీడియా, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.4-0.7 శాతం మధ్య పుంజుకోగా.. ఫార్మా 3.2 శాతం పతనమైంది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, టాటా స్టీల్‌, ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, వేదాంతా, హిందాల్కో, యూపీఎల్‌, అల్ట్రాటెక్, బీపీసీఎల్‌, హెచ్‌యూఎల్‌ 3.6-1.7 శాతం మధ్య ఎగశాయి. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా 5.5 శాతం చొప్పున పతనంకాగా.. విప్రో, పవర్‌గ్రిడ్‌,  సిప్లా, టీసీఎస్‌, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం 2.3-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఫార్మా వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, అపోలో హాస్పిటల్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌, జిందాల్‌ స్టీల్‌, ఎన్‌ఎండీసీ, రిలయన్స్‌ కేపిటల్‌, ఫెడరల్‌ బ్యంక్‌ 9.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క గ్లెన్‌మార్క్‌, నాల్కో, బాష్‌, లుపిన్‌, మైండ్‌ట్రీ, ఒరాకిల్‌ 7-2 శాతం మధ్య పతనమయ్యాయి. 

మిడ్‌ క్యాప్స్‌ ప్లస్‌
మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ 811 షేర్లు లాభపడగా.. 591 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో హెచ్‌సీజీ, ఈస్టర్‌, హాథవే, జెనిసిస్, సర్లా పాలీ, జీ లెర్న్‌, ఐబీ ఇంటి, సోరిల్‌, 5పైసా, ఆషాపురా, లక్ష్మీవిలాస్‌, రుషిల్‌ తదితరాలు 11-5 శాతం మధ్య పెరిగాయి.