చివర్లో కుప్పకూలిన మార్కెట్లు

చివర్లో కుప్పకూలిన మార్కెట్లు

దశాబ్ద కాలం తరువాత మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు దెబ్బతగిలింది. అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనుకావడంతో సోమవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో పేరుకు మాత్రమే లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో రోజంతా నేలచూపులతోనే కదిలాయి. ప్రధానంగా మిడ్‌సెషన్‌ తదుపరి అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు కుప్పకూలాయి. చివరికి సెన్సెక్స్‌ 624 పాయింట్లు కోల్పోయి 36,958 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 184 పాయింట్లు పతనమై 10,926 వద్ద ముగిసింది. వెరసి గత రెండు రోజుల్లో మార్కెట్లు ఆర్జించిన లాభాలు ఒక్కరోజులోనే ఆవిరయ్యాయి. సెన్సెక్స్‌ 37,000.. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌ దిగువన స్థిరపడ్డాయి. ప్రధానంగా ఇండెక్స్‌ హెవీవెయిట్‌ ఆర్‌ఐఎల్‌.. నిఫ్టీకి100 పాయింట్ల బలాన్నివ్వడం గమనార్హం. 

బేర్‌.. 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 4-1 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ప్రధాన రంగాలు ఆటో, బ్యాంకింగ్‌, ఐటీ,  ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 4-2 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 11 శాతం కుప్పకూలగా..  బజాజ్ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐషర్‌, గ్రాసిమ్‌, మారుతీ, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌ 6-5 శాతం మధ్య పడిపోయాయి. బ్లూచిప్స్‌లో ఐబీ హౌసింగ్‌ 14 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 10 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో సన్‌ ఫార్మా 4 శాతం, గెయిల్‌ 1.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. 

భెల్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో బీహెచ్ఈఎల్‌ 11 శాతం కుప్పకూలగా.. మదర్‌సన్‌, దివీస్‌, ముత్తూట్‌, జస్ట్‌ డయల్‌, భారత్‌ ఫోర్జ్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎన్‌సీసీ, అరవింద్‌ 9-6.5 శాతం మధ్య దిగజారాయి. కాగా.. మరోవైపు హెక్సావేర్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఇంజినీర్స్‌, నిట్‌ టెక్‌, బెర్జర్‌ పెయింట్స్‌, అరబిందో ఫార్మా 3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

మిడ్‌ క్యాప్స్‌ వీక్‌
మార్కెట్లు చివర్లో కుప్పకూలిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలోనూ అమ్మకాలు పెరిగాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2.3-1.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. మొత్తం 1652 షేర్లు నష్టపోగా.. 862 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల యూటర్న్‌
దాదాపు నెల రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) శుక్రవారం రూటు మార్చి రూ. 204 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. కాగా.. కొద్ది రోజులుగా పెట్టుబడులకే  కట్టుబడుతున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం నగదు విభాగంలో రూ. 607 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. అయితే గురువారం(8న) ఎఫ్‌పీఐలు రూ. 437 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 291 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');