ఆ.. షేర్లపై గిగాఫైబర్‌ ఎఫెక్ట్‌

ఆ.. షేర్లపై గిగాఫైబర్‌ ఎఫెక్ట్‌

దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వచ్చే నెల నుంచి గిగాఫైబర్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో పలు కంపెనీలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ద్వారా జియో గిగాఫైబర్‌ సర్వీసులను సెప్టెంబర్‌ 5 నుంచీ ప్రారంభించినున్నట్లు ఆర్‌ఐఎల్‌ 42వ ఏజీఎం సందర్భంగా ముకేశ్‌ తెలియజేశారు. నెలకు రూ. 700 చార్జీ ద్వారా కనీసం 100 ఎంబీ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్, సెట్‌టాప్‌ బాక్సుల ద్వారా టీవీ సేవలు, ల్యాండ్‌లైన్‌ ద్వారా ఉచిత కాల్‌ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వివరించింది. దీంతో లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్న లిస్టెడ్‌ కంపెనీలు హాథవే కేబుల్స్‌ అండ్‌ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, జీటీపీఎల్‌ హాథవే కౌంటర్లు జోరందుకున్నాయి. మరోపక్క ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీలు పీవీఆర్‌ లిమిటెడ్‌, ఐనాక్స్‌ లీజర్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ హాథవే కేబుల్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంటే.. మరోపక్క పీవీఆర్‌, ఐనాన్స్‌ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

అటూఇటూ..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హాథవే కేబుల్‌ 20 శాతం దూసుకెళ్లింది. రూ. 23.7కు చేరింది. ఈ బాటలో డెన్‌ నెట్‌వర్క్స్‌ 9.5 శాతం జంప్‌చేసి రూ. 66ను తాకింది. ఇంట్రాడేలో రూ. 71ను సైతం అధిగమించింది. కాగా.. మరోపక్క పీవీఆర్‌ లిమిటెడ్‌ 4.5 శాతం పతనమై రూ. 1400కు చేరింది. తొలుత రూ. 1345 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా ఐనాక్స్‌ లీజర్‌ 4.5 శాతం దిగజారి రూ. 288 వద్ద కదులుతోంది. తొలుత రూ. 271 వరకూ పడిపోయింది. ఇక తొలుత 6 శాతం ఎగసి రూ. 81 వరకూ పెరిగిన జీటీపీఎల్‌ హాథవే తదుపరి 2 శాతం నీరసించింది. రూ. 75కు చేరింది.

తొలి రోజే తొలి షో
జియో ఫస్ట్ డే ఫస్ట్‌ షో పేరుతో ప్రీమియం కస్టమర్లు కొత్తగా రిలీజయ్యే సినిమాలను ఇంటినుంచే వీక్షించవచ్చని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. అటు డీటీహెచ్‌, టెలిఫోన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ద్వారా లోకల్‌ కేబుల్‌ కంపెనీలకు జోష్‌నివ్వగా.. ఇటు పీవీఆర్, ఐనాక్స్‌ లీజర్‌ కౌంటర్లకు జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ప్రణాళికలు షాకిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. డెన్‌ నెట్‌వర్క్స్‌, హాథవే కేబుల్ కంపెనీలలో ఆర్‌ఐఎల్‌ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నట్లు గతేడాదిలోనే ప్రకటించిన విషయం విదితమే.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');