భెల్‌- భారత్‌ ఫోర్జ్‌.. క్యూ1 షాక్‌

భెల్‌- భారత్‌ ఫోర్జ్‌.. క్యూ1 షాక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో విద్యుత్‌ పరికరాల తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా.. ప్రస్తుత ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరాాశాపూరిత పనితీరు ప్రదర్శించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ కౌంటర్‌ సైతం నష్టాలతో డీలా పడింది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లపట్ల విముఖత చూపడంతో ఈ రెండు షేర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

బీహెచ్‌ఈఎల్‌ 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో పీఎస్‌యూ దిగ్గజం బీహెచ్ఈఎల్‌ రూ. 218 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 41 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 24 శాతం క్షీణించి రూ. 4411 కోట్లను తాకింది. ఈ కాలంలో రూ. 216 కోట్ల నిర్వహణ నష్టం నమోదుకాగా.. గత క్యూ1లో రూ. 155 కోట్ల ఇబిటా సాధించింది. ఈ పీఎస్‌యూ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది.  ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10.5 శాతం కుప్పకూలి రూ. 51 దిగువన ట్రేడవుతోంది. తద్వారా 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్‌ 11.15 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 13.65 లక్షల షేర్లు చేతులు మారాయి.

Image result for Bharat forge ltd

భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో కళ్యాణి గ్రూప్‌ దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ నికర లాభం 28 శాతం నీరసించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 3.5 శాతం తక్కువగా రూ. 2328 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నిర్వహణ లాభం 15 శాతం క్షీణించి రూ. 415 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 20.3 శాతం నుంచి 17.8 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో భారత్‌ ఫోర్జ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.2 శాతం పతనమై రూ. 33 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్‌ 46,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 2.1 లక్షల షేర్లు చేతులు మారాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');