71 ఎగువకు.. రూ'పాయే'

71 ఎగువకు.. రూ'పాయే'

ఓవైపు దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొనసాగుతున్న పతనం.. మరోపక్కఆర్థిక మాంద్యం ఆందోళనలు దేశీ కరెన్సీకి షాక్‌నిచ్చాయి. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 42 పైసలు పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్‌ మార్కెట్లో 0.6 శాతం దిగజారి 71.20 వద్ద ట్రేడవుతోంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 71 మార్క్‌ ఎగువకు చేరింది. సోమవారం బక్రీద్‌ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. శుక్రవారం సైతం రూపాయి 9 పైసలు నీరసించి 70.78 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 70.44-70.82 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. కాగా.. అమెరికా, చైనా వాణిజ్య వివాదాల మధ్య గురువారం(8న) సైతం రూపాయి ఒక దశలో 70.94 వరకూ దిగజారింది. అయితే చివరిలో కోలుకుంది. 5 రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడతూ 20 పైసలు బలపడింది. 70.69 వద్ద ముగిసింది. 

ఎఫ్‌పీఐల విక్రయాలు
గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఆగస్ట్‌ నెలలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 11,135 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇదే సమయం(1-9)లో మరోపక్క రుణ సెక్యూరిటీలలో రూ. 1937 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. దీంతో దేశీ కేపిటల్‌ మార్కెట్లలో  నికరంగా ఎఫ్‌పీఐలు రూ. 9,197 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయ్యింది. 

210 పైసలు లాస్‌
డాలరుతో మారకంలో వరుసగా ఐదో రోజు గతబుధవారం(7న) డీలా పడటం ద్వారా రూపాయి 210 పైసలు కోల్పోయింది. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో బంగారానికి డిమాండ్‌ పెరుగుతుంటే.. స్టాక్స్‌, చమురు, కరెన్సీలలో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో చైనీస్‌ కరెన్సీ యువాన్‌ 11 ఏళ్ల కనిష్టానికి చేరడంతో సోమవారం రూపాయి ఏకంగా 113 పైసలు పడిపోయింది. గత ఆరేళ్లలోనే ఇది అత్యధిక(1.6 శాతం) నష్టంకాగా.. చివరికి నాలుగు నెలల కనిష్టం 70.73 వద్ద స్థిరపడింది. ఇంతక్రితం 2013 ఆగస్ట్‌లో మాత్రమే ఈ స్థాయిలో రూపాయి తిరోగమించింది. ఫలితంగా మూడు రోజుల్లోనే రూపాయి 194 పైసల విలువను కోల్పోయింది. కాగా.. శుక్రవారం(2న) సైతం డాలరుతో మారకంలో రూపాయి భారీగా 54 పైసలు క్షీణించింది. 69.60 వద్ద ముగిసింది.  Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');