నష్టాల్లో- మిడ్‌ క్యాప్స్‌ బోర్లా

నష్టాల్లో- మిడ్‌ క్యాప్స్‌ బోర్లా

2008 తరువాత మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు దెబ్బతగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగడంతో సోమవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలుత కొన్ని సెకన్లపాటు లాభాలతో కనిపించిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో నేలచూపులతోనే కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 184 పాయింట్లు క్షీణించి 37,398కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 50 పాయింట్ల వెనకడుగుతో 11,059 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,321 వద్ద కనిష్టాన్ని తాకగా.. నిఫ్టీ సైతం 11,041 వరకూ జారింది.

యస్ బ్యాంక్ నో.. 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, బ్యాంకింగ్‌ 2.2-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. మీడియా మాత్రమే(0.4 శాతం) బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 10 శాతం కుప్పకూలగా..  ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, ఐషర్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, మారుతీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ 6-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐబీ హౌసింగ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 11 శాతం చొప్పున జంప్‌చేయగా.. గెయిల్‌, సన్‌ ఫార్మా, టైటన్‌, జీ, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్ 3.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి.

భెల్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో బీహెచ్ఈఎల్‌, మదర్‌సన్‌ 10 శాతం చొప్పున కుప్పకూలగా.. జస్ట్‌ డయల్‌, సెయిల్‌, భారత్‌ ఫోర్జ్, ఐడియా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, దివీస్‌ లేబ్‌ 7.4-5.4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు పేజ్‌ ఇండస్ట్రీస్‌, హెక్సావేర్‌, అరబిందో ఫార్మా, అమరరాజా, ఇంజినీర్స్‌, ఎన్‌బీసీసీ 3.6-2.2 శాతం మధ్య ఎగశాయి. 

నేలచూపులో
మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ 1310 షేర్లు నష్టపోగా.. 899 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. మిడ్‌క్యాప్స్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, సన్‌ టీవీ, ఇండియన్‌ బ్యాంక్‌, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, ఇండియన్‌ హోటల్‌, జిందాల్‌ స్టీల్‌, వొకార్డ్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, టాటా కమ్యూనికేషన్స్‌, టీవీఎస్‌ మోటార్‌, బాలకృష్ణ, సెంట్రల్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ తదితరాలు 4.5-3 శాతం మధ్య క్షీణించాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');