అరవింద్‌- ముంజాల్‌.. క్యూ1 దెబ్బ

అరవింద్‌- ముంజాల్‌.. క్యూ1 దెబ్బ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో బ్రాండెడ్‌ దుస్తుల రిటైలింగ్‌ కంపెనీ అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ బాటలో.. ప్రస్తుత ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో చూపిన పనితీరు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఆటో విడిభాగాల కంపెనీ ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ రూ. 98 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 16 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం క్షీణించి రూ. 901 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 51 శాతం పడిపోయి రూ. 20 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 4 శాతం నుంచి 2.2 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 9 శాతం కుప్పకూలి రూ. 513 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 486 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.

Image result for munjal auto industries ltd

ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌ నికర లాభం 53 శాతం నీరసించి రూ. 4 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం దాదాపు యథాతంగా రూ. 301 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 46 శాతం క్షీణించి రూ. 14 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.8 శాతం నుంచి 4.7 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.2 శాతం పతనమై రూ. 33 వద్ద ట్రేడవుతోంది.Most Popular