ఐటీ, ఆటో, బ్యాంక్స్‌ దెబ్బ

ఐటీ, ఆటో, బ్యాంక్స్‌ దెబ్బ

దశాబ్ద కాలం తదుపరి మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో దేశీయంగానూ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలుత కొన్ని సెకన్లపాటు లాభాలతో కనిపించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం హెవీవెయిట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరందుకున్నప్పటికీ మార్కెట్లకు నేలచూపు తప్పకపోవడం గమనార్హం. ప్రస్తుతం సెన్సెక్స్‌ 229 పాయింట్లు క్షీణించి 37,353కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 54 పాయింట్ల వెనకడుగుతో 11,056 వద్ద ట్రేడవుతోంది. 

మీడియా ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్‌ 1.5-1.2 శాతం స్థాయిలో నష్టపోయాయి. మీడియా 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, గ్రాసిమ్‌ 4.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 11.5 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 9 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో బీపీసీఎల్‌, జీ, గెయిల్‌,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌,  సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌ 2.6-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి.

దివాన్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో దివీస్‌ లేబ్‌, ఐడియా, డిష్‌ టీవీ, టొరంట్‌ ఫార్మా, ముత్తూట్‌, మైండ్‌ట్రీ, మదర్‌సన్‌ 8-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివాన్‌ హౌసింగ్‌, ఎన్‌బీసీసీ, రిలయన్స్‌ కేపిటల్‌, మహానగర్‌ గ్యాస్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎండీసీ, హెక్సావేర్ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. 

మిడ్‌ క్యాప్స్‌ వీక్‌
మార్కెట్లు పతన బాట పట్టిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.9-0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ 862 షేర్లు నష్టపోగా.. 739 లాభాలతో కదులుతున్నాయి. మిడ్‌క్యాప్స్‌లో బాలకృష్ణ, చోళమండలం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసెక్‌, ఇండియన్‌ హోటల్‌, టీవీఎస్‌, కంకార్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, టాటా కమ్యూనికేషన్స్‌, నాట్కో, సెంట్రల్‌ బ్యాంక్‌ తదితరాలు 3-2 శాతం మధ్య క్షీణించాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');