సెప్టెంబర్‌ నుండి జియో ఫైబర్  సర్వీసులు...!

సెప్టెంబర్‌ నుండి జియో ఫైబర్  సర్వీసులు...!

ఎంతో కాలంగా వినియోగ దారులు ఎదురు చూస్తున్న జియో ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5 నుండి అందుబాటులోకి రానున్నాయి. సోమవారం నాడు జరిగిన రిలయన్స్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరమ్‌కో తమ కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్‌ ఆయిల్‌  డివిజన్‌లో సౌదీ అరమ్‌కో 20శాతం వాటాల కోసం పెట్టుబడులు పెట్టనుందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతి పెద్ద భాగస్వామ్యమని ముఖేష్ పేర్కొన్నారు. 
సెప్టెంబర్ 5 నుండి జియో ఫైబర్ సేవలు!
 జియో నుంచి నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీనిలో భాగంగా భారత దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో ఫైబర్ టారిఫ్ ప్లాన్ 700 రూపాయల నుంచి మొదలై రూ.10,000 వరకూ ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను పొందొచ్చని తెలిపారు. అంతే కాకుండా 2020 మధ్య కాలం కల్లా ఇంట్లో నుండే విడుదలైన కొత్త సినిమాలను తొలి రోజు .. తొలి ఆటనే వీక్షించే సుదుపాయాన్ని కల్పించనున్నట్టు ముఖేష్ ప్రకటించారు. దేశంలోనే అత్యంత వేగవంతమైన నెట్ వర్క్, హై డాటా స్పీడ్ ను వినియోగ దారులకు అందించనున్నట్టు ముఖేష్ పేర్కొన్నారు.  కేవలం సెట్ టాప్ బాక్స్ సాయంతో వీడియో కాల్స్ చేసుకునేలా, కాన్ఫరెన్స్ నిర్వహించేలా జియో వీడియో కాల్స్ ను అభివృద్ధి చేసింది. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్, కుమార్తె ఇషా ఈ  ఫీచర్‌ను రిలయన్స్ 42వ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు. ఈ సెటప్ బాక్సుతో సినిమాలు చూడటంతో పాటు వీడియో కాల్స్, వాయిస్ సెర్చ్, మ్యూజిక్, తదితర సేవలు పొందవచ్చని ఇషా, ఆకాష్ అంటున్నారు. 
జియో ప్రారంభ ఆఫర్‌గా టీవీ ఉచితం...!
జియో గిగా ఫైబర్ సదుపాయంతో గేమింగ్, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో ఉన్న మిత్రులతో కలిసి మల్టీ ప్లేయర్ గేమింగ్ లో పాల్గొనడం, షాపింగ్, వినోదం, వర్చువల్ రియాల్టీ వంటి సదుపాయాలు ఇందులో మిక్స్‌డ్ రియాలిటీ పేరిట తీసుకురానున్నారు. నెలకు రూ. 500 చెల్లించడం ద్వారా అమెరికా, కెనడా దేశాల్లో ఉన్న బంధువులు, మిత్రులతో అపరిమితంగా మాట్లాడుకునే సదుపాయాన్ని (‘పే ఫర్ వన్ సర్వీస్’)  జియో అందించనుంది. ఈ సేవలు సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్నాయి.  వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో ఫైబర్ వార్షిక ప్లాన్స్‌తో 4కే సెట్ టాప్ బాక్స్‌తో పాటు హెచ్‌డీ/4కే ఎల్‌ఈడీ టీవీ ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం.
రుణ రహిత సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 
సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రానున్న 18 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా సంస్థలోని వాటాదారులకు, షేర్ హోల్డర్స్‌కు పీరియాడిక్ బోనస్‌లు, హైయ్యర్ డివిడెండులు చెల్లించనున్నామని ప్రకటించారు. కంపెనీ ఆదాయంలో సింహభాగం రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ నుండి వస్తుందని, రాబోయే 5 ఏళ్ళ కాలంలో ఎబిటిడా 15 శాతం వృద్ధిని నమోదు చేయనున్నట్టు ముఖేష్ అంబానీ ఆకాంక్షించారు. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');