మార్కెట్లకు ట్రంప్‌-సాల్వినీ దెబ్బ

మార్కెట్లకు ట్రంప్‌-సాల్వినీ దెబ్బ

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆందోళన పరుస్తున్న వాణిజ్య వివాదాలకు మరోసారి అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆజ్యం పోశారు. చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా లేమంటూ శుక్రవారం ట్రంప్‌ పేర్కొన్నారు. చైనా కోరుకుంటున్నప్పటికీ వేగంగా స్పందించే అవకాశంలేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనీస్‌ టెలికం కంపెనీ హువేతో బిజినెస్‌ నిర్వహించేదిలేదంటూ వాషింగ్టన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత వారం మధ్యలో పుంజుకున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు తిరిగి డీలాపడ్డాయి. తొలుత పతన బాట పట్టిన మార్కెట్లు చివరికి కొంతమేర కోలుకున్నాయి. వెరసి వారాంతాన డోజోన్స్‌ 91 పాయింట్లు(0.35 శాతం) క్షీణించి 26,287 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 19 పాయింట్లు(0.65 శాతం) నీరసించి 2,919 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 80 పాయింట్ల(1 శాతం) వెనకడుగుతో 7,959 వద్ద స్థిరపడింది. నికరంగా గత వారం డోజోన్స్‌ 0.75 శాతం, ఎస్‌అండ్‌పీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నాస్‌డాక్‌ సైతం 0.6 శాతం నష్టపోయింది.

యూరోప్‌ పతనం
ఇటలీని పాలిస్తున్న అధికార రాజకీయ కూటమిలో విభేదాలు చెలరేగడంతో శుక్రవారం ఇటాలియన్‌ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ పతనమయ్యాయి. ఇటలీ డిప్యూటి ప్రధాని, అధికార లెగా పార్టీ నేత మ్యాటియో సాల్వినీ కొత్తగా ఎన్నికలకు పిలుపు నివ్వడంతో రాజకీయ సంక్షోభానికి తెరలేచింది. ఫలితంగా యూరోపియన్‌ మార్కెట్లు సైతం వారాంతాన వెనకడుగు వేశాయి. యూకే 0.5 శాతం, ఫ్రాన్స్‌1.2 శాతం, జర్మనీ 1.3 శాతం చొప్పున క్షీణించాయి. 

Image result for amgen enbrelImage result for uber technologies inc

ఆమ్జెన్‌ హైజంప్‌
కీళ్ల నొప్పి, నరాల వాపు(రుమటాయిడ్‌ ఆర్థిరైటిస్‌) వ్యాధుల చికిత్సకు వినియోగించే ఎన్‌బ్రెల్‌ ఔషధ పేటెంట్‌పై హక్కులు ఆమ్జెన్‌కే ఉన్నట్లు యూఎస్‌ కోర్టు స్పష్టం చేయడంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. హెల్త్‌కేర్ దిగ్గజం నోవర్తిస్‌ పిటీషన్‌ను కొట్టివేస్తూ.. ఆమ్జెన్‌ పేటెంట్‌ మనుగడలో ఉన్నట్లు కోర్టు తెలియజేసింది. దీంతో ఆమ్జెన్‌ షేరు 6 శాతం జంప్‌చేసింది. కాగా.. క్యూ2లో 520 కోట్ల డాలర్ల భారీ నష్టాన్ని ప్రకటించడంతోపాటు.. ఆదాయం క్షీణించడంతో ఉబర్‌ టెక్నాలజీస్ కౌంటర్‌లో అమ్మకాలు పెరిగాయి. ఈ షేరు 7 శాతం పతనమైంది. గురువారం సైతం ఉబర్‌ 7 శాతం తిరోగమించిన సంగతి తెలిసిందే. మరోపక్క ప్రయోగాత్మక కేన్సర్ ఔషధం బెమ్‌పెగ్‌ తయారీలో సమస్యలు ఎదురుకావడంతో నెక్టర్‌ థెరప్యూటిక్స్‌ షేరు సైతం డీలాపడింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');