4 వారాల నష్టాలకు చెల్లు

4 వారాల నష్టాలకు చెల్లు

ఎట్టకేలకు దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు వారాల తదుపరి గత వారం లాభాలతో నిలిచాయి. శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్‌ నికరంగా 464 పాయింట్లు(1.25 శాతం) పుంజుకుని 37,582 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 112 పాయింట్లు(1 శాతం) జమ చేసుకుని 11,110 వద్ద ముగిసింది. వెరసి నాలుగు వారాల నష్టాలకు చెక్‌ పడింది. కాగా.. గత వారం తొలి మూడు రోజులూ అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు, బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై ప్రతిపాదించిన సర్‌చార్జీ, అధిక సంపన్న వర్గాలపై పన్ను వంటి అంశాలు దేశీయంగా మార్కెట్లను దెబ్బతీశాయి. అయితే సినట్లు నిపుణులు చెబుతున్నారు.  

చిన్న షేర్లు ఓకే
గత వారం మార్కెట్లతోపాటు మధ్య, చిన్నతరహా షేర్లకూ డిమాండ్‌ కనిపించింది. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ మరింత అధికంగా 1.6 శాతం ఎగసింది. మిడ్ క్యాప్‌ 13,670 వద్ద, స్మాల్‌ క్యాప్‌ 12,700 వద్ద ముగిశాయి. 

Image result for coffee day

ఆటో స్పీడ్‌
గత వారం బ్లూచిప్స్‌లో హీరో మోటో, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, బజాజ్ ఫిన్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో 9-4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టాటా స్టీల్‌ 11 శాతం పతనంకాగా.. యస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, టాటా మోటార్స్‌, సిప్లా, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, ఐటీసీ, జీ, ఐవోసీ, గెయిల్‌ 7-4 మధ్య వెనకడుగు వేశాయి. 

చిన్న షేర్లు జోరు
చిన్న షేర్లలో గత వారం నవకార్‌ 39 శాతం దూసుకెళ్లగా.. జేఅండ్‌కే బ్యాంక్‌, వెంకీస్‌, కేఈఐ, శర్దా క్రాప్‌, హిమాద్రి, ఫ్యూచర్‌ కన్జూమర్, సెంట్రల్‌ బ్యాంక్‌, వినతీ, నీల్‌కమల్‌, ఐఐఎఫ్‌ఎల్‌, మిండా, టీటీకే, ఇన్ఫీబీమ్, కేర్‌, జీఈ, ఐఎఫ్‌సీఐ, జేఎం 24-10 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కాఫీ డే, కాక్స్‌ కింగ్స్‌, ఎన్‌బీసీసీ, జాగరణ్‌, పరాగ్‌ మిల్క్‌, టైమ్‌ టెక్నో, జిందాల్‌ స్టీల్‌, బలరామ్‌పూర్, వొడాఫోన్‌, బిర్లాసాఫ్ట్‌, రెడింగ్టన్‌, టాటా స్టీల్‌, కమిన్స్, జీఎస్‌ఎఫ్‌సీ, లెమన్‌ ట్రీ, ప్రిజమ్‌ 27-8 శాతం మధ్య పతనమయ్యాయి.