ఐబీ హౌసింగ్‌ హై- యస్‌ బ్యాంక్‌ బోర్లా

ఐబీ హౌసింగ్‌ హై- యస్‌ బ్యాంక్‌ బోర్లా

నిబంధనలకు అనుగుణంగా వాటాను తగ్గించుకోనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌కు కంపెనీ ప్రమోటర్‌ తెలియజేయడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ భారీ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోవైపు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా నిధుల సమీకరణ చేపడుతున్న నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ఈ షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..  

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
లక్ష్మీ విలాస్‌ బ్యాంకు విలీనం తదుపరి ప్రమోటర్‌ గ్రూప్‌ వాటాను 10 శాతం దిగువకు తగ్గించుకోనున్నట్లు ప్రమోటర్‌ సమీర్‌ గెహ్లాట్‌ రిజర్వ్‌ బ్యాంకుకు నివేదించినట్లు వార్తలు వెలువడ్డాయి. విలీన సంస్థపై నియంత్రణను సైతం గెహ్లాట్‌ వొదులుకోనున్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌ఎఅండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ దివాళా తదుపరి ఎన్‌బీఎఫ్‌సీలకు అటు బ్యాంకులు, ఇటు మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి నిధుల లభ్యత కష్టతరమైన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేసుకోవడం ద్వారా ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌... బ్యాంకు హోదాను పొందే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐబీ హౌసింగ్‌లో ప్రమోటర్లకు 21.5 శాతం వాటా ఉంది. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు విలీనం తదుపరి ఈ వాటా తగ్గనుండగా.. నిబంధనలకు అనుగుణంగా మరికొంత వాటాను విక్రయించవలసి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఐబీ హౌసింగ్‌ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 488 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 503ను సైతం అధిగమించింది.

Image result for yes bank ltd

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
పెట్టుబడుల ఆవశ్యకత నేపథ్యంలో క్విప్‌ చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు యస్‌ బ్యాంక్‌ గురువారం సాయంత్రం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఇందుకు ఫ్లోర్‌ ధరను రూ. 87.9గా నిర్ణయించింది. తద్వారా బ్యాంకు రూ. 2,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్యాంకు కొత్త సీఎఫ్‌వో, సీవోవో, సీసీవోలను ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం బ్యాంక్ సీఎఫ్‌వోగా రాజ్‌ అహుజా, చీఫ్‌ కంప్లయెన్స్ ఆఫీసర్‌గా రాకేష్‌ మెహ్రన్‌ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంకు షేరు 7 శాతం పతనమై రూ. 83 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 92.5 వరకూ ఎగసింది. కాగా.. ఉదయం సెషన్‌లో ఈ కౌంటర్లో బ్లాక్‌డీల్‌ ద్వారా 11.8 లక్షల షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. గత ఏడాది కాలంలో ఈ షేరు 77 శాతం దిగజారడం గమనార్హం!tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');