ఈ షేర్లు- భారీ లాభాలతో కళకళ

ఈ షేర్లు- భారీ లాభాలతో కళకళ

వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు లాభాల హైజంప్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ కౌంటర్లు భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. అంతేకాకుండా ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. వెరసి ఈ కౌంటర్లన్నీ మార్కెట్లను మించిన లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో నవకార్‌ కార్పొరేషన్, ఫ్యూచర్‌ కన్జూమర్‌, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్‌, ఏరీస్‌ ఆగ్రో లిమిటెడ్‌, ఇన్‌స్పిరిసిస్‌ సొల్యూషన్స్‌, డీసీఎం లిమిటెడ్‌ చోటుచేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

నవకార్‌ కార్పొరేషన్: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 27 వద్దకు చేరింది. తొలుత రూ. 28 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 37,700 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.08 లక్షల షేర్లు చేతులు మారాయి.

హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 85 వద్దకు చేరింది. తొలుత రూ. 87 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 55,500 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.5 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఫ్యూచర్‌ కన్జూమర్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం పెరిగి రూ. 31 వద్ద ట్రేడవుతోంది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.55 లక్షల షేర్లు. అయితే నేటి ట్రేడింగ్‌లో ఇప్పటివరకూ 1.03 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఏరీస్‌ ఆగ్రో లిమిటెడ్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 56.50 వద్ద ఫ్రీజయ్యింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడమే దీనికి కారణం. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,300 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 6,300 షేర్లు చేతులు మారాయి.

ఇన్‌స్పిరిసిస్‌ సొల్యూషన్స్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46.70 వద్ద ఫ్రీజయ్యింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడమే దీనికి కారణం. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 323 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 621 షేర్లు చేతులు మారాయి.

డీసీఎం లిమిటెడ్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22 వద్ద ఫ్రీజయ్యింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడమే దీనికి కారణం. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1,800 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1,350 షేర్లు చేతులు మారాయి.



tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');