సెన్సెక్స్ క్వాడ్రపుల్‌- కొనుగోళ్ల హవా

సెన్సెక్స్ క్వాడ్రపుల్‌- కొనుగోళ్ల హవా

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరింత జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం క్వాడ్రపుల్‌ సాధించింది. 423 పాయింట్లు జంప్‌చేసి 37,750కు చేరింది. నిఫ్టీ సైతం 134 పాయింట్లు ఎగసి 11,167 వద్ద ట్రేడవుతోంది. నిరుద్యోగిత తగ్గడం, టెక్నాలజీ కౌంటర్లకు పెరిగిన డిమాండ్‌ కారణంగా గురువారం అమెరికా మార్కెట్లు దూకుడు చూపాయి. కాగా.. ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుడుతుండటంతో మరోసారి భారీ లాభాలతో కదులుతున్నాయి. 

మీడియా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ జోరందుకున్నాయి. ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ, ఆటో 1.6-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 11 శాతం జంప్‌చేయగా.. వేదాంతా, ఐషర్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ 4-2.2 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్ బ్యాంక్‌, ఐటీసీ, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఎంఅండ్‌ఎం, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌ 2.7-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఫైనాన్స్‌ స్టాక్స్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఉజ్జీవన్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, నెస్లే, ఈక్విటాస్‌ 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు.. ఎన్‌బీసీసీ 11.5 శాతం కుప్పకూలగా, బిర్లాసాఫ్ట్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, మహానగర్‌ గ్యాస్‌, అరవింద్‌, టొరంట్‌ పవర్‌, టొరంట్‌ ఫార్మా 5.3-1 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌, మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌, సన్‌టెక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 6.5-1 శాతం మధ్య లాభపడ్డాయి.

మిడ్‌, స్మాల్‌ గుడ్‌
మార్కెట్లు హుషారుగా కదులుతున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ 1544 షేర్లు లాభపడగా.. 618 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో లుమాక్స్‌, క్లారియంట్‌, ఐఎఫ్‌బీ ఆగ్రో, దావత్‌, పనాసియా, ఆర్‌ఎంఎల్‌, యూనివర్శల్‌ కేబుల్స్‌, నవకార్‌, లుమాక్స్‌ టెక్‌, జీపీఐఎల్‌, ఎల్‌జీ బాలకృష్ణన్‌, సెట్కో, కాయా, ఐసీఐఎల్‌, మ్యాక్స్‌ వెంచర్స్‌, హిమాద్రి తదితరాలు 15-10 శాతం మధ్య దూసుకెళ్లాయి.