కుప్పకూలిన ఎన్‌బీసీసీ- ఇన్ఫీబీమ్‌ ప్లస్‌

కుప్పకూలిన ఎన్‌బీసీసీ- ఇన్ఫీబీమ్‌ ప్లస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో నిర్మాణ రంగ కంపెనీ ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో బీటూబీ ఈకామర్స్ సర్వీసుల కంపెనీ ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. వెరసి ఎన్‌బీసీసీ కౌంటర్‌ భారీ అమ్మకాలతో కళతప్పగా.. ఇన్ఫీబీమ్ షేరు లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

ఎన్‌బీసీసీ ఇండియా 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌బీసీసీ ఇండియా నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 49 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం వెనకడుగుతో రూ. 1891 కోట్లను తాకింది. నిర్వహణ లాభం మరింత అధికంగా 65 శాతం నీరసించి  రూ. 27 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 3.4 శాతం నుంచి 1.4 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌బీసీసీ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11.5 శాతం కుప్పకూలి రూ. 35 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 34 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.

Image result for infibeam avenues ltd

ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ఈకామర్స్‌ సేవల కంపెనీ ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 28 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 27 శాతం క్షీణించి రూ. 186 కోట్లకు పరిమితమైంది. అయితే నిర్వహణ లాభం 39 శాతం పెరిగి రూ. 38 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 10.6 శాతం నుంచి 20.5 శాతానికి మెరుగుపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 43 వద్ద ట్రేడవుతోంది. Most Popular