హెక్సావేర్‌- టాటా కెమ్‌.. హుషార్‌

హెక్సావేర్‌- టాటా కెమ్‌.. హుషార్‌

ప్రస్తుత ఏడాది(2019) రెండో త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించడంతో ఎరువులు, ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీ టాటా కెమికల్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019) క్యూ2లో ఐటీసేవల కంపెనీ పేజ్‌ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 151 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 3.5 శాతం పెరిగి రూ. 1308 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 10 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 13.8 శాతం నుంచి 14.5 శాతానికి మెరుగుపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో హెక్సావేర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 384 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 399 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Image result for tata chemicals ltd

టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 16 శాతం ఎగసి రూ. 240 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 6 శాతం పుంజుకుని రూ. 2,897 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 21 శాతం ఎగసి రూ. 592 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 17.8 శాతం నుంచి 20.4 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో టాటా కెమికల్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 581 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 602 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.