జోరుగా.. హుషారుగా షురూ

జోరుగా.. హుషారుగా షురూ

ఉన్నట్టుండి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యాయి. మరోపక్క యూరప్‌, అమెరికా మార్కెట్లు సైతం క్రితం రోజు దూకుడు చూపాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం డబుల్‌ సాధించింది. ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుడుతుండటంతో సెన్సెక్స్‌ 244 పాయింట్లు ఎగసి 37,571కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 11,112 వద్ద ట్రేడవుతోంది. గత వారం నిరుద్యోగిత తగ్గడం, టెక్నాలజీ కౌంటర్లకు పెరిగిన డిమాండ్‌ వంటి అంశాలు అమెరికా మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. 

మీడియా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 9 శాతం జంప్‌చేయగా.. పవర్‌గ్రిడ్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, హెచ్‌డీఎఫ్‌సీ 2.5-1.4 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, ఐటీసీ, యస్‌ బ్యాంక్‌, ఐవోసీ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

దివాన్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో దివాన్‌ హౌసింగ్‌, హెక్సావేర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌, ఇంజినీర్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, టాటా కెమికల్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 7-4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు ఎన్‌బీసీసీ 9 శాతం కుప్పకూలగా, పేజ్‌, టొరంట్‌ ఫార్మా, బాటా, బాష్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌, మహీంద్రా లైఫ్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌ 5.5-1.2 శాతం మధ్య లాభపడ్డాయి.

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ 1151 షేర్లు లాభపడగా.. 344 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో క్లారియంట్‌, ఐఎఫ్‌బీ ఆగ్రో, దావత్‌, మ్యాక్స్‌ వెంచర్స్‌, ప్రైకోల్‌, సెరెబ్రా, సౌరాష్ట్ర, కాన్ఫిడెన్స్‌, ఎమ్‌కే, ఐసీఐఎల్‌, ఎక్సెల్‌, ఓరికాన్‌, ఇన్ఫీబీమ్‌, ముంజాల్‌ ఆటోతదితరాలు 15-6 శాతం మధ్య జంప్‌చేశాయి.