ఈ షేర్లు మార్కెట్లను మించి పడ్డాయ్‌

ఈ షేర్లు మార్కెట్లను మించి పడ్డాయ్‌

చివరి సెషన్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. వెరసి ఈ కౌంటర్లన్నీ మార్కెట్లను మించిన నష్టాలతో కళతప్పాయి. జాబితాలో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పరాగ్‌ మిల్క్‌ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ చోటుచేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 16.5 శాతం కుప్పకూలి రూ. 70 వద్దకు చేరింది. తొలుత రూ. 68 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7.3 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 33 లక్షల షేర్లు చేతులు మారాయి.

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం పడిపోయి రూ. 50 దిగువకు చేరింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 36 లక్షలు షేర్లుకాగా.. ఇప్పటివరకూ 44 లక్షల షేర్లు చేతులు మారాయి.

పరాగ్‌ మిల్క్‌ఫుడ్స్‌ లిమిటెడ్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 179 వద్దకు చేరింది. తొలుత రూ. 178 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 47,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 87,000 షేర్లు చేతులు మారాయి.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమై రూ. 362 దిగువన నిలిచింది. తొలుత రూ. 360 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 7 లక్షల షేర్లు చేతులు మారాయి.Most Popular