రెపో రేటులో 0.35 శాతం కోత

రెపో రేటులో 0.35 శాతం కోత

వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో తాజాగా మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) 0.35 శాతం కోత విధించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. రివర్స్‌ రెపో సైతం ఈ మేరకు 5.15 శాతానికి వెనకడుగు వేసింది. ఇక ఎంఎస్‌ఎఫ్‌తోపాటు బ్యాంక్‌ రేటు 5.65 శాతానికి చేరింది.ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు ఎంపీసీ పరపతి సమీక్షను చేపట్టింది. సోమవారం(5న) ప్రారంభమైన సమావేశ నిర్ణయాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. కాగా.. తాజా నిర్ణయంతో పాలసీ సమీక్షలలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌.. వరుసగా నాలుగోసారి రెపో రేటు తగ్గింపును చేపట్టినట్లయ్యింది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం పురోగతిని నమోదు చేయగలదని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) అంచనాలను 3.5-3.7 శాతంగా పేర్కొంది.  

అంచనాలు ఇలా
రెపో రేటులో 0.25-0.5 శాతం స్థాయిలో కోతను అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో కోత పెట్టడం ద్వారా ఇటీవల బలహీనపడ్డ ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ ఊతమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతమే పుంజుకున్న నేపథ్యంలో రేట్ల తగ్గింపు అంచనాలు పెరిగినట్లు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీ తదితర రంగాలు ఆర్థిక సమస్యలతో కుదేలవడంతో లిక్విడిటీ కల్పనకు సైతం చర్యలు తీసుకుకోనున్నట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కాగా.. జూన్‌లో జరిగిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వరుసగా మూడోసారి పావు శాతం కోత పెట్టడం ద్వారా రెపో రేటును 5.75 శాతానికి చేర్చింది. తద్వారా 2010 సెప్టెంబర్‌ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు చేరడం విశేషం! tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');