వహ్వా.. దివాన్‌- భళా.. యాంబర్‌ 

వహ్వా.. దివాన్‌- భళా.. యాంబర్‌ 

ఫైనాన్షియల్‌ సలహాదారు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సహకారంతో రూపొందించిన రుణ పరిష్కార(డెట్‌ రిజల్యూషన్‌) ప్రణాళికను దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ రుణదాతల ముందు ఉంచింది. ఈ అంశాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేయడంతో ఉన్నట్టుండి ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. కాగా.. మరోవైపు రీసెర్చ్‌ సంస్థ ఎస్‌పీఏ సెక్యూరిటీస్‌.. షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో వైట్‌గూడ్స్‌ పరిశ్రమలో కాంట్రాక్ట్‌ తయారీ దిగ్గజం యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేశాయి. వివరాలు చూద్దాం..

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
లిక్విడిటీ సమస్యలలో చిక్కుకున్న ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేసన్‌ ఎట్టకేలకు డెట్‌ రిజల్యూషన్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక ముసాయిదా ప్రకారం రుణదాతలు రుణ మొత్తాల(ప్రిన్సిపల్‌)కు కోత పెట్టనవసరం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే రుణ చెల్లింపులపై మారటోరియం విధించాలని దివాన్‌ కోరుతున్నట్లు పేర్కొన్నాయి. ఇదే విధంగా రిటైల్‌ రుణాల బిజినెస్‌ను తిరిగి ప్రారంభించేందుకు వీలుగా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు నుంచి తాజా క్రెడిట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రుణ వాయిదాల చెల్లింపు గడువులను పెంచడం తదితర అంశాలతో కూడిన ఈ ప్రణాళికను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం ఆమోదించవలసి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 31 శాతం దూసుకెళ్లి రూ. 55ను తాకింది. ఇంట్రాడేలో రూ. 58 వరకూ ఎగసింది.

Image result for amber enterprises india ltd

యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేడిమి, ఉక్కపోతల కారణంగా ఎయిర్‌కండిషనర్ మార్కెట్‌కు మరింత డిమాండ్‌ పుట్టనున్నట్లు ఎస్‌పీఏ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ప్రధానంగా చైనా, ఇండియాలలో రూమ్‌ ఎయిర్‌ కండిషనర్ల తయారీ సామర్థ్య విస్తరణను కంపెనీలు చేపట్టే వీలున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ ఎయిర్‌ కండిషనర్‌ మార్కెట్లో ఓఈఎం కంపెనీ యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రొడక్టులకు డిమాండ్‌ పెరగనున్నట్లు అంచనా వేసింది. వెరసి రూ. 1040 టార్గెట్‌ ధరతో ఈ షేరు కొనుగోలుకి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 795ను తాకింది. ఇంట్రాడేలో రూ. 812 వరకూ ఎగసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');