ఈ షేర్లు భారీ ట్రేడింగ్‌తో పతనం!

ఈ షేర్లు భారీ ట్రేడింగ్‌తో పతనం!

మార్కెట్లు పతనమైన నేపథ్యంలో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. వెరసి ఈ కౌంటర్లన్నీ మార్కెట్లను మించిన నష్టాలతో కళతప్పాయి. జాబితాలో జాగరణ్‌ ప్రకాశన్‌, ఎన్‌బీసీసీ ఇండియా, ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌, సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గతి లిమిటెడ్‌, ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ చోటుచేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

జాగరణ్‌ ప్రకాశన్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 14 శాతం కుప్పకూలి రూ. 67 వద్దకు చేరింది. తొలుత రూ. 64.3 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,300 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 11,200 షేర్లు చేతులు మారాయి.

ఎన్‌బీసీసీ ఇండియా: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం పడిపోయి రూ. 38 దిగువకు చేరింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7.2 లక్షలు షేర్లుకాగా.. ఇప్పటివరకూ 16 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.5 శాతం నష్టంతో రూ. 39 వద్దకు చేరింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.23 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.88 లక్షల షేర్లు చేతులు మారాయి.

గతి లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 41 వద్ద దిగువన ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 70,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 2.24 లక్షల షేర్లు చేతులు మారాయి.

సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమై రూ. 57 వద్దకు చేరింది. . తొలుత రూ. 50 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,900 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 3,500 షేర్లు చేతులు మారాయి.

ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 12.5 శాతం కుప్పకూలి రూ. 80 దిగువకు చేరింది. తొలుత రూ. 77 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 20,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.Most Popular