హెచ్‌1బీ వీసాలలో భారత్‌దే ఆధిపత్యం

హెచ్‌1బీ వీసాలలో భారత్‌దే ఆధిపత్యం

ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన హెచ్‌1బీ వీసాలలో భారత్‌ వాటా 72 శాతమని యూఎస్‌ కౌన్సులర్‌ వ్యవహారాల హెడ్‌(అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌) మైఖేల్‌ బాండ్‌ హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా పేర్కొన్నారు. అమెరికాకు విచ్చేసే ప్రయాణికులలో అత్యధిక శాతంమంది టూరిస్ట్‌, బిజినెస్‌ వీసాలతో వస్తారని, హెచ్‌1బీ వీసాల జారీ ద్వారా భారత్ గరిష్టంగా లబ్ది పొందుతుందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన వ్యక్తులకు జారీ చేసే వీసాలను హెచ్‌1బీగా వ్యవహరించే సంగతి తెలిసిందే. టూరిజం, బిజినెస్‌ ప్రయాణికుల విషయాన్ని పక్కనపెడితే భారత్‌కే అత్యధిక స్థాయిలో హెచ్‌1బీ వీసాలను జారీ చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. వెరసి ఈ ఏడాది జారీచేసిన హెచ్‌1బీ వీసాలలో భారత్‌కు చెందిన నిపుణులకే 72 శాతం జారీ అయినట్లు వెల్లడించారు. ఇదే విధంగా ఎల్‌ వీసాలు పొందిన వారిలోనూ భారతీయులు 30 శాతం ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1,38,000 హెచ్‌1బీ వీసాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది 60,000 స్టూడెంట్‌ వీసాలను జారీ చేశామని, దీనిలో హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉన్నదని చెప్పారు. స్టూడెంట్‌ వీసాల జారీకి హైదరాబాద్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నట్లు తెలియజేశారు.  Most Popular