స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 5)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 5)
 • మ్యాగి న్యూడిల్స్‌ తయారీ కోసం గుజరాత్‌లో తొమ్మిదో ఫ్యాక్టరీని నిర్మించనున్న నెస్లే
 • గురుగ్రామ్‌, హర్యాణ ప్లాంట్‌లలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో 10శాతం మందిని సెలవులో పంపిన మారుతీ సుజుకీ
 • ఆగస్ట్‌ 10న జరిగే బోర్డు మీటింగ్లో బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనున్న ఎన్‌ఐఐటీ
 • బోనస్‌ ఇష్యూకు ఆస్ట్రాల్‌ పాలీ టెక్నిక్‌ డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • జీఎంఆర్ ఛత్తీస్‌ఘడ్‌ ఎనర్జీ టేకోవర్‌ను పూర్తిచేసిన అదాని పవర్‌
 • రూ.100 కోట్ల కమర్షియల్‌ పేపర్స్‌ పేమెంట్‌లో డీఫాల్ట్‌ అయిన కాక్స్‌ అండ్‌ కింగ్స్‌
 • రాజస్తాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లలో 3 స్టోర్లను ప్రారంభించిన వీమార్ట్‌ రిటైల్‌
 • బెంగళూరులో రోడ్ల అభివృద్ధి కోసం రూ.107.9 కోట్ల ఆర్డర్లను సంపాదించిన ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌
 • ఆగస్ట్‌ 8న జరిగే త్రైమాసిక బోర్డు మీటింగ్‌ను వాయిదా వేసిన కాఫీడే, త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్న కంపెనీ
 • 300 ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఇన్‌స్టాల్‌ చేసిన టాటాపవర్‌
 • ఎన్‌హెచ్‌ఏఐ నుంచి రూ.145.3 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
 • రూ.834 కోట్ల విలువైన  కాంట్రాక్టులను దక్కించుకున్న బీఈఎంఎల్‌


Most Popular