నేడు మార్కెట్లు మళ్లీ బోర్లా?!

నేడు మార్కెట్లు మళ్లీ బోర్లా?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 80 పాయింట్లు పతనమై 10,935 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య వివాదాలు ముదురుతుండటంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు పతన బాట పట్టాయి. మరోవైపు వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం వరుసగా ఐదో రోజు తోకముడిచాయి. వచ్చే నెల నుంచీ 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో ఇందుకు తగిన విధంగా స్పందించనున్నట్లు చైనా ప్రభుత్వం సైతం ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. 

రోలర్‌ కోస్టర్- చివర్లో ప్లస్‌
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య వివాదాలు తలెత్తడంతో వారాంతాన పతన బాటలో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌ తదుపరి రికవరీ సాధించాయి. చివరికి సెన్సెక్స్‌ 100 పాయింట్లు పుంజుకుని 37,118 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 17 పాయింట్లు బలపడి 10,997 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్‌ తిరిగి 37,000 మార్క్‌ను అందుకోగా.. నిఫ్టీ 11,000 మైలురాయి సమీపంలో నిలిచింది. కాగా.. తొలుత అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 400 పాయింట్ల వరకూ పతనంకాగా.. నిఫ్టీ 130 పాయింట్ల వరకూ తిరోగమించింది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,607కు చేరగా.. నిఫ్టీ 10,849ను తాకింది. అయితే చివర్లో సెన్సెక్స్‌ 37,375 వద్ద, నిఫ్టీ 11,080 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకడం గమనార్హం!

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,871 పాయింట్ల వద్ద, తదుపరి 10,744 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,102 పాయింట్ల వద్ద, తదుపరి 11,207 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,913, 27,620 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,521, 28,837 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అమ్మకాలవైపే ఎఫ్‌పీఐలు
గత వారం తొలి 4 రోజుల్లో నగదు విభాగంలో రూ. 3900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) శుక్రవారం మరోసారి రూ. 2,888 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ధీటుగా గత వారం తొలి నాలుగు రోజుల్లో రూ. 5,470 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) వారాంతాన దాదాపు రూ. 2813 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం విశేషం! tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');